https://oktelugu.com/

Pooja Hegde: తన భవిష్యత్ ఆ స్టార్ హీరో చేతిలో పెట్టిన పూజా హెగ్డే..!

ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజా .. ఇప్పుడు అవకాశాల కోసం నానా తిప్పలు పడుతుంది. సౌత్ లో కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. కాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 18, 2024 / 10:15 AM IST

    Pooja Hegde

    Follow us on

    Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఓ రెండేళ్లుగా సరైన హిట్ పడక సతమతం అవుతుంది. ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ ఇలా వరుస ప్లాప్స్ తో డీలా పడింది పూజ హెగ్డే కి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో హిందీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది సల్మాన్ ఖాన్ కి జంటగా ‘ కిసీకా భాయ్ కిసీకా జాన్ ‘ సినిమాలో నటించింది. ఈ చిత్రం సైతం డిజాస్టర్ గా నిలిచింది.

    ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజా .. ఇప్పుడు అవకాశాల కోసం నానా తిప్పలు పడుతుంది. సౌత్ లో కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. కాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తుంది. స్టార్ హీరో సూర్య నటించబోతున్న 44వ సినిమాలో పూజా హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ మాల్దీవుల్లో జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతుందని టాక్ వినిపిస్తుంది.

    ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సూర్య తో పూజా సినిమా చేయడం ఇదే మొదటిసారి. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో పూజ భవిష్యత్ సూర్య చేతిలో ఉంది. ఆయన హిట్ ఇస్తే పూజా కెరీర్ నిలబడుతుంది.

    అలాగే పూజా హెగ్డే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తుంది. తెలుగులో నాగ చైతన్య తదుపరి సినిమాలో పూజా ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కోట్లకు కోట్లు డిమాండ్ చేసిన పూజా హెగ్డే రెమ్యూనరేషన్ కూడా తగ్గించిందట. అందుకే మరలా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ ఉంది.