Peddi day 2 collections: కరువులో ఉన్న టాలీవుడ్ కి ధమ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో, అలా అన్నమాట నిన్న విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా సెన్సేషనల్ గా నమోదు అయ్యాయి. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ స్టార్ హీరో సినిమాకు సంపూర్ణమైన పాజిటివ్ టాక్ రాలేదు. ఎన్టీఆర్ ‘దేవర’ , పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలకు కూడా డివైడ్ టాక్ వచింది, కానీ భారీ హైప్ ఉండడం వల్ల, ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క ‘పుష్ప 2’ చిత్రానికి మాత్రమే సంపూర్ణమైన పాజిటివ్ టాక్ వచ్చింది , ఆ తర్వాతి స్థానం మాత్రం ‘పెద్ది’ చిత్రానికే దక్కింది.
ఆకాశాన్ని అంటిన అంచనాలను అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. బుచ్చి బాబు ఆ విషయం లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అనే చెప్పాలి. మొదటి రోజు ఓపెనింగ్ తర్వాత , రెండవ రోజు ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో , ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారా లేదా అనే అనుమానాలు చాలానే ఉండేవి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ , ఈ చిత్రానికి రెండవ రోజున మార్నింగ్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ బోర్డులు కనపడుతున్నాయి. ఇక బుక్ మై షో యాప్ లో అయితే ఈ చిత్రానికి గంటకు 25 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మ్యాంటీ షోస్ అయితే నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయి అనడం లో అతిశయోక్తి లేదు.
ఇక ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి రెండవ రోజున ప్రపంచవ్యాప్తంగా 35 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ ఊపుని బట్టీ , ఈ లెక్క పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 15 నుండి 17 నుండి కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ రోజున వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.
