Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది హరి హర వీరమల్లు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు హరి హర వీరమల్లు పార్ట్ 1 టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ఎలా ఉందో చూద్దాం. టీజర్లోనే చిత్ర కథపై ఒక హిట్ ఇచ్చారు. హరి హర వీరమల్లు మొగలుల కాలం నాటి కథ. మొఘలులు భారతదేశాన్ని ఏలుతున్న రోజుల్లో హిందువులపై అరాచకాలు చోటు చేసుకున్నాయి.
ప్రజల శ్రమను, సంపదను వాళ్ళు దోచుకున్నారు. సామాన్యుడి నుండి దొరలు, దొరల నుండి నవాబులు, నవాబుల నుండి మొఘలులు ప్రజల సంపద లాక్కున్నారు. ఈ అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు… దీనార్థులను కాపాడేందుకు ఒకడు వస్తాడు. అతడే హరి హర వీరమల్లు. హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గెటప్ కేక అనడంలో సందేహం లేద.టీజర్ లోని వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ రేపేదిగా ఉంది. దొరల లెక్కలు సరి చేసే వాడే ఈ వీరమల్లు అని పవన్ పాత్రకు గట్టి ఎలివేషన్ ఇచ్చారు.
ఇక టీజర్లో విజువల్స్ ప్రధాన ఆకర్షణ. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. ప్రధాన విలన్ బాబీ డియోల్ ని సైతం పరిచయం చేశారు. ఆయన మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు. మరొక విశేషం ఏమిటంటే హరి హర వీరమల్లు రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగానికి సంబంధించిన టీజర్ ఇది. కాగా టీజర్ లో దర్శకుడు క్రిష్ పేరు మెన్షన్ చేయలేదు. ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తుండగా నిజమే అనిపిస్తుంది.
మరి హరి హర వీరమల్లు నూతన దర్శకుడు ఎవరో చూడాలి. పవన్ కళ్యాణ్ కి జంటగా నిధి అగర్వాల్, నోరా ఫతేహి నటిస్తున్నారు. సునీల్, నాజర్, రఘుబాబు ఇతర కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తంగా టీజర్ అంచనాలు పెంచేసింది. ఉన్నత నిర్మాణ విలువలు కలిగి ఉంది.