https://oktelugu.com/

Pallavi Prashanth-Sivaji: గురువు శివాజీకి పల్లవి ప్రశాంత్ అదిరిపోయే గిఫ్ట్… ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్!

రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ఓ పేద రైతు కుటుంబానికి సహాయం చేశాడు. వారికి లక్ష రూపాయల డబ్బుతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 25, 2024 / 10:03 AM IST

    Pallavi Prashanth gift to Sivaji

    Follow us on

    Pallavi Prashanth-Sivaji: బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన ప్రియమైన గురువు శివాజీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీంతో శివాజీ తెగ సంతోష పడిపోయాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? అందులో ఏముందో..? ఇప్పుడు తెలుసుకుందాం. పల్లవి ప్రశాంత్ కి శివాజీ మధ్య ఉన్న బాండింగ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి బంధం గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు బాగా తెలుసు. హౌస్ లో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ గురు శిష్యులుగా మెలిగారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ స్పై బ్యాచ్ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

    రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ఓ పేద రైతు కుటుంబానికి సహాయం చేశాడు. వారికి లక్ష రూపాయల డబ్బుతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొన్నారు. సందీప్ మాస్టర్, భోలే షావలి, శివాజీ హజరైయ్యారు. ఇక శివాజీ చేతుల మీదుగా ఆ రైతు కుటుంబానికి డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ శివాజీకి కూడా ఓ గిఫ్ట్ ఇచ్చాడు.

    శివాజీకి బ్రూ కాఫీ పౌడర్ బహుమతిగా ఇచ్చాడు ప్రశాంత్. దీంతో శివాజీ తెగ నవ్వుకున్నాడు. శివాజీకి కాఫీ పౌడర్ బహుమతిగా ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉంది. శివాజీకి కాఫీ అంటే ప్రాణం. బిగ్ బాస్ హౌస్లో కాఫీ కోసం పోరాటం చేశాడు శివాజీ. కాఫీ పంపితేనే ఉంటా లేదంటే వెళ్లి పోతా అని బిగ్ బాస్ ని అల్లాడించాడు. ఫైనల్ గా పంతం నెగ్గించుకుని కాఫీ సాధించాడు. దీంతో శివాజీకి సరదాగా ఇలా కాఫీ పొడి డబ్బా గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రశాంత్. ఇందుకు సంబంధించిన ఫోటో శివాజీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

    దీంతో నెటిజన్లు ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పొలం పనులు చేసుకుంటున్నాడు.అలాగే బిగ్ బాస్ ప్రైజ్ మనీ మరికొంత మంది పేద రైతులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక శివాజీ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. నైంటీస్ వెబ్ సిరీస్ రూపంలో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తనకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని ఇటీవల వెల్లడించాడు.