RRR Oscar: ఆర్ ఆర్ ఆర్ విడుదలై నెలలు గడుస్తున్నా సినిమా గురించి చర్చ నడుస్తూనే ఉంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇంటర్నేషనల్ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శిస్తుండగా ఆడియన్స్ ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. ఇక ఆస్కార్ కోసం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఇండియా నుండి నామినేషన్స్ కి పంపకున్నా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అవకాశం ఉంది. లాస్ ఏంజెల్స్ లో రెండు వారాలకు పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో థియేటర్స్ లో ప్రదర్శించబడిన ఏ చిత్రమైనా జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ఆల్రెడీ 15 విభాగాల్లో నామినేషన్స్ కోసం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ అప్లై చేయడం జరిగింది. వీటిలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటులు(ఎన్టీఆర్,చరణ్) విభాగాలు చాలా ప్రత్యేకం. 15 విభాగాల్లో ఏ విభాగం నుండి ఆస్కార్ కి ఆర్ ఆర్ ఆర్ నామినేటైనా కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఒక అద్భుత అవకాశం దక్కనుందట. వీరిద్దరూ ఆస్కార్ వేదికపై డాన్స్ చేసే ఆస్కారం కలదట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘నాటు నాటు’ సాంగ్ కి లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారట.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ స్టెప్స్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేదికపై పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలో ఎలాగైనా ఇది సాకారం కావాలని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఒక ప్రధాన హైలెట్. ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసిన సాంగ్ అది. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్స్ ప్రాచుర్యం పొందాయి. ఇక ఎన్టీఆర్, చరణ్ ల ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి ఎన్ని మార్కులు వేసినా తక్కువే.

పరిశ్రమలో గొప్ప డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, చరణ్ దుమ్మురేపారు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. డివివి దానయ్య రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవ్ గణ్, అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఆర్ ఆర్ ఆర్ లో నటించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.