https://oktelugu.com/

Tollywood Richest Hero: టాలీవుడ్ రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా? ప్రభాస్, చరణ్, మహేష్ అనుకుంటే పొరపాటే!

టాలీవుడ్ లో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ రిచెస్ట్ హీరో వీరెవరూ కాదట. టైర్ టు జాబితాలో ఉన్న ఆ స్ట్రగులింగ్ హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 11:05 AM IST

    Tollywood Richest Hero

    Follow us on

    Tollywood Richest Hero: ఓ టాలీవుడ్ హీరో ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తెలుగులో రిచ్చెస్ట్ హీరోలైన నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, రామ్ చరణ్ లకు మించిన సంపన్నుడట. అలాగని అతనేమీ బడా స్టార్ కూడా కాదు. కానీ అతను అనుకుంటే సగం హైదరాబాద్ ను కొనేయగలడట. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. హీరోగా ‘యువసేన ‘ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

    Also Read: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!

    యువసేన మూవీలో నలుగురు హీరోలు కాగా. వారిలో ఒకడిగా శర్వానంద్ నటించాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. గమ్యం, ప్రస్థానం వంటి సినిమాలు శర్వానంద్ కి స్టార్డం తెచ్చిపెట్టాయి. మంచి నటుడిగా శర్వానంద్ దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డాడు. యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేస్తూ శర్వానంద్ సక్సెస్ అయ్యాడు. రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు, జాను చిత్రాలతో శర్వానంద్ టైర్ టు హీరోల లిస్ట్ లో చేరిపోయారు. శర్వానంద్ స్వస్థలం విజయవాడ. హైదరాబాద్ లో చదువుకున్నాడు.

    Tollywood Richest Hero(1)

    శర్వానంద్ ఫ్యామిలీకి పలు వ్యాపారాలు ఉన్నాయట. బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించారట. శర్వానంద్ తల్లిదండ్రులు బాగా శ్రీమంతులు అట. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల శర్వానంద్ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయట. శర్వానంద్ తన స్నేహితుడితో హైదరాబాద్ లో కారులో సంచరిస్తూ .. ఆ ఇల్లు మాదే, ఈ స్థలం మాదే అంటూ పలు చోట్ల ఉన్న వారి ఆస్తులు చూపించాడట. గతంలో ఓ సందర్భంలో శర్వానంద్ ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అతని ఆస్తుల గురించి ప్రశ్నించారు.

    హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లినా మీకు ఆస్తులు ఉన్నాయట. సగం హైదరాబాద్ మీదేనట అని శర్వానంద్ ని జర్నలిస్ట్ అడిగారు. దానికి సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులు లేవు కానీ .. మాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నమాట వాస్తవం అని శర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు. అంత ఆస్తి ఉన్నా కూడా టీనేజ్ నుండి శర్వానంద్ ఇండిపెండెంట్ గా ఉండేవారట. తన ఖర్చులకు తానే సంపాదించుకునే వాడట.

    శర్వానంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. శర్వానంద్ కి రామ్ చరణ్, రానా దగ్గుబాటి క్లాస్ మేట్స్ కావడం కొసమెరుపు. ప్రస్తుతం శర్వానంద్ కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన లేటెస్ట్ మూవీ మనమే ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    2017లో శర్వానంద్ కి రెండు హిట్స్ పడ్డాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన శతమానం భవతి మంచి విజయం అందుకుంది. శర్వానంద్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అదే ఏడాది మహానుభావుడు మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మహానుభావుడు సూపర్ హిట్ కొట్టింది. మహానుభావుడు అనంతరం శర్వానంద్ కి క్లీన్ హిట్ లేదు. ఆయన అనేక ప్రయోగాలు చేస్తున్నారు.