https://oktelugu.com/

Niharika Konidela: రెండో పెళ్లి పై నిహారిక ఓపెన్ కామెంట్స్… గుడ్ న్యూస్ చెప్పిందిగా!

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-వెంకట చైతన్య వివాహం ఐదు రోజులు ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. దాంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 15, 2024 / 02:40 PM IST

    Niharika Konidela open comments on Second marriage

    Follow us on

    Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల రెండో పెళ్లి పై ఓపెన్ కామెంట్స్ చేశారు. తన అభిప్రాయం తెలియజేశారు. నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక మనసు ఆమె డెబ్యూ మూవీ. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ ఎమోషనల్ ట్రాజిక్ లవ్ డ్రామా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే నిహారిక నటనకు మార్క్స్ పడ్డాయి. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం టైటిల్స్ తో యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రాలు చేసింది. యాక్టింగ్ నుండి బ్రేక్ తీసుకున్న నిహారిక 2020 డిసెంబర్ నెలలో వివాహం చేసుకుంది.

    రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-వెంకట చైతన్య వివాహం ఐదు రోజులు ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. దాంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. రెండేళ్ల తర్వాత విడిపోయారు. విడాకులకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా నిర్మాతగా రాణించాలని భావిస్తుంది. గత ఏడాది హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చిత్రాలు, సిరీస్లు తెరకెక్కించాలని భావిస్తుంది.

    అలాగే కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేస్తుంది. ఇటీవల ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నిహారిక ఎంపికైంది. కెరీర్ మీద పూర్తి దృష్టి పెట్టిన నిహారిక… రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఈ ప్రశ్నకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నిహారిక మాట్లాడుతూ… మరొకరిపై ప్రేమ కలగదు అంటే నేను నమ్మను. ఒక రిలేషన్ షిప్ ఫెయిల్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. అలా కొన్ని కారణాల వలన మ్యారేజ్ వర్క్ అవుట్ కాలేదు.

    నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలను కనాలంటే వివాహం చేసుకోవాల్సిందే. కాబట్టి పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాను. అది ఎప్పుడు అనేది చెప్పలేను… అని అన్నారు. కాబట్టి నిహారికకు రెండో వివాహం ఆలోచన ఉంది. పిల్లల కోసమైనా రెండో వివాహం చేసుకుంటానని ఓపెన్ గా చెప్పేసింది. నిహారిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా గత ఏడాది వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం ఇటలీ దేశంలో జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఒక్కటయ్యారు.