https://oktelugu.com/

Niharika Konidela: అల్లు అర్జున్ కి నిహారిక అలా కౌంటర్ ఇచ్చిందా… మరోసారి బయటపడ్డ మెగా-అల్లు విబేధాలు!

కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ వేదికపై నిహారిక కొణిదెల చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు దక్కిన గౌరవాలను ఉద్దేశిస్తూ మాట్లాడే క్రమంలో నిహారిక అల్లు అర్జున్ కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో అల్లు-మెగా కుటుంబాల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయనే వాదనకు బలం చేకూరింది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 8, 2024 / 12:59 PM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ వాదన మరింత ఊపందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడం పెద్ద రచ్చ అయింది. శిల్పా రవి కోసం అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తో కలిసి నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున ప్రచారం చేశాడు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

    జన సైనికులు, మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ తో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. పరాయి వాళ్లకు పని చేసేవాడు మావాడైనా పగవాడే… అని నాగబాబు ట్విట్టర్ లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. కొద్దిసేపటికి ఆ ట్వీట్ నాగబాబు డిలీట్ చేసినప్పటికి అది వైరల్ అయింది. అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు అలా ట్వీట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం కలకలం రేపింది.

    మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెడుతున్నారు అనే వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ లో సెలబ్రేషన్స్ జరిగాయి. కానీ అల్లు అర్జున్ అక్కడ లేకపోవడం విచిత్రం. పైగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. అయితే తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

    కావాలనే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిహారిక తన సొంత బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ‘ కమిటీ కుర్రోళ్ళు’. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. కాగా’ కమిటీ కుర్రోళ్ళు ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో .. ఈ మధ్య కాలంలో మా ఫ్యామిలీకి అంతా బాగా జరుగుతుంది. మా చరణ్ అన్న సినిమా ఆస్కార్ కి వెళ్ళింది.

    మా పెదనాన్నకి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. నిర్మాతగా నా తొలి చిత్రాన్ని సక్సెస్ చేయండి ప్లీజ్ ‘ అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుని రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కావాలనే నిహారిక అల్లు అర్జున్ పేరు చెప్పలేదా? అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందా? తమ కుటుంబంలో ఒకడిగా బన్నీని చూడటం లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.