New Guidelines Tollywood Film Productions: ప్రేక్షకులకు థియేటర్ కు రాకపోవడం.. ఓటీటీల ఎఫెక్ట్.. స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు , నటీనటుల పారితోషికాల పెంపుతో కుదేలవుతున్న నిర్మాతలు మొత్తం షూటింగ్ లు బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే చర్చలు ఫలించి ఆగస్టు 25 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో షూటింగులకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సినిమాల సందడి మళ్లీ మొదలైన నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించి తెలుగు ఫిలిం చాంబర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
Also Read: Krithi Shetty: ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి శెట్టి…. ఆ దోషం పోవడానికేనా? గతంలో రష్మిక కూడా!
-సినిమా నిర్మాణాలకు కొత్త మార్గదర్శకాలు
-ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
-చిత్రం, పాత్ర ఆధారంగా నటీనటుల పారితోషికాన్ని నిర్మాతలే నిర్ణయిస్తారు.
-నటీనటులు, ప్రధాన టెక్నీషియన్ల పర్సనల్ స్టాఫ్, బస, హోటల్స్ ఖర్చులన్నీ అందులోనే ఉంటాయి..
-ఆర్టిస్టుతో ఒప్పందానికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ నిర్మాతలు ఇవ్వరు.
-ప్రతీ అగ్రిమెంట్ లో పారితోషికం, ఫుడ్ ఖర్చులు, ట్రాన్స్ పోర్టు, హోటల్, స్టాఫ్ ఖర్చులన్నీ ఇమిడి ఉంటాయి.. అదనంగా నిర్మాత ఇవ్వాల్సింది ఏమీ ఉండదు. వివరాలు ఖచ్చితంగా ఉండాలి.చాంబర్ వీటిని డిసైడ్ చేస్తుంది.
-సినిమా టైటిల్స్, థియేట్రికల్ రిలీజ్ ప్రచారంలో ఓటీటీ, శాటిలైట్ భాగస్వాముల పేర్లు ఉండవు.
-సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి
-తెలంగాణలో ఇచ్చిన పర్సంటేజీని ఏపీలో కూడా ఇవ్వాలని తీర్మానించారు.
ఇవన్నీ చిత్రనిర్మాణ సంస్థల కార్యాలయాలకు అందజేస్తారు. అందరు నిర్మాతలు ఇదే పాటించాలి.
Also Read:Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టార్.. జన సేనాని రాజకీయ లక్ష్యం అదే!