Narasimha Naidu : నిన్న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం ‘నరసింహ నాయుడు’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మాస్ మూవీస్ లో కల్ట్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది, ఈ చిత్రానికి కనీస స్థాయి వసూళ్లు కూడా రాక రీ మాస్టర్ చేయించిన బయ్యర్ కి నష్టాలను మిగిలించింది.
ఈ సినిమాని లేటెస్ట్ 4K క్వాలిటీ తో రీ మాస్టర్ చేయించడం చిన్న పని కాదు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వడానికి సుమారుగా 20 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది. దానికి తోడు పబ్లిసిటీ మెటీరియల్ మరియు థియేటర్స్ రెంటల్ అగ్రిమెంట్స్ , ఇలాంటివి అన్నీ కలుపుకుంటే చాలానే ఖర్చు అవుతుంది.
అలా ఈ సినిమా పెట్టిన డబ్బులను మొత్తం రికవర్ చెయ్యాలంటే కచ్చితంగా 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టాలి. కానీ ఈ సినిమాకి మొదటి రోజు కనీసం 20 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇందులో షేర్ లెక్కగడితే 10 లక్షల రూపాయిలు కూడా ఉండదు. ఈ సినిమా వారం రోజుల వరకు ప్రదర్శితం అవుతుంది.
మొదటి రోజే వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ సినిమాకి , ఫుల్ రన్ లో ఏమొస్తుందిలే అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. బాలయ్య కెరీర్ లో మైలు రాయి గా నిల్చిపోయిన ఒక సినిమాని , పుట్టిన రోజు నాడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తే ఇంత తక్కువ వసూళ్లు వస్తాయని ఊహించలేదు అంటూ ట్రేడ్ పండితులు కామెంట్ చేసారు.మరో పక్క బాలయ్య దురాభిమానుల ఈ సినిమా వసూళ్లను చూసి నవ్వుకుంటున్నారు.