https://oktelugu.com/

Naga Chaitanya: ఒక పద్దతి ప్రకారం సమంత ని మోసం చేసిన నాగ చైతన్య..అమాయకంగా కనిపిస్తూ ఇన్ని కుట్రలా!

శోభితతో నిశ్చితార్థం జరిగిన రోజే నాగ చైతన్య సమంత ని అన్ ఫాలో కొట్టి, పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. సానుభూతి కోసం మాత్రమే నాగ చైతన్య ఇంత కాలం అమాయకుడిగా నటించాడని సమంత అభిమానులతో పాటు, సోషల్ మీడియా లో ఉండే ఇతర నెటిజెన్స్ కూడా నాగచైతన్య పై విరుచుకుపడుతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 12:03 PM IST

    Naga Chaitanya(1)

    Follow us on

    Naga Chaitanya: సోషల్ మీడియా లో ఇప్పుడు మనం ఎక్కడ చూసిన అక్కినేని నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి వార్తలే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన శోభిత తో డేటింగ్ లో ఉన్నాడా లేదా అనే అయోమయ్యంలో ఫ్యాన్స్ ఉండేవారు. కానీ నిజంగానే ఆయన శోభితతో నిశ్చితార్థం చేసుకొని అందరినీ షాక్ కి గురి చేసాడు. అంతే కాదు గడిచిన రెండేళ్లలో నాగ చైతన్య – సమంత విడిపోయిన తర్వాత అందరూ సమంతదే తప్పు అని భావించి ఆమె మీద ఎన్నో ట్రోల్ల్స్ వేస్తూ వచ్చారు. ముఖ్యంగా ట్విటర్ లో అయితే ఆమెపై ట్రోలింగ్ దారుణంగా ఉండేది. ఆ ట్రోల్ల్స్ ని ఆమె తట్టుకోలేక ట్విట్టర్ ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో ఆమె తనపై కక్ష్య కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్న కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెల్స్ మీద కోర్టులో కేసు కూడా వెయ్యాల్సి వచ్చింది. కానీ పాపం సమంత ని ఎవ్వరూ పట్టించుకోలేదు.

    దీంతో సమంత విసిగిపోయి నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోవడం మానేసింది. సమంత పై ఇంత ట్రోల్ల్స్ రావడానికి కారణం అమాయకంగా కనిపించే నాగ చైతన్యనే అని చెప్పొచ్చు. సమంత అతనితో విడాకులు తీసుకునే ముందే సోషల్ మీడియా లో అభిమానులకు కొన్ని హింట్స్ ఇచ్చింది. ఆమె ప్రొఫైల్ పేరు ని మార్చి, నాగ చైతన్య తో దిగిన పెళ్లి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తొలగించింది. నాగ చైతన్య ని కూడా ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో కొట్టింది. కానీ నాగ చైతన్య మాత్రం సమంత తో జరిగిన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను ఈ రెండేళ్లు తొలగించకుండా, సమంతాని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండేవాడు. ఇది చూసి నాగచైతన్య ఎంత మంచోడో చూడండి, ఇలాంటోడిని మిస్ చేసుకొని సమంత దురదృష్టవంతురాలు అయ్యింది అంటూ ఆమెపై రెట్టింపు ట్రోల్ల్స్ వచ్చేవి. అంతే కాకుండా జరిగిన ఈ విడాకులలో నాగ చైతన్య తప్పు ఏమాత్రం లేదు అని అనుకున్నారు.

    కానీ శోభితతో నిశ్చితార్థం జరిగిన రోజే నాగ చైతన్య సమంత ని అన్ ఫాలో కొట్టి, పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. సానుభూతి కోసం మాత్రమే నాగ చైతన్య ఇంత కాలం అమాయకుడిగా నటించాడని సమంత అభిమానులతో పాటు, సోషల్ మీడియా లో ఉండే ఇతర నెటిజెన్స్ కూడా నాగచైతన్య పై విరుచుకుపడుతున్నారు. అంటే శోభిత తో రిలేషన్ ని నాగ చైతన్య సమంత తో వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే మైంటైన్ చేసేవాడని జరుగుతున్న ఈ సంఘటనలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుమారుగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.