https://oktelugu.com/

Mohan Babu Comments on Chiru: చిరంజీవి పై మోహన్ బాబు సంచలన కామెంట్స్ !

Mohan Babu Comments on Chiru: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ భనన నిర్మాణాన్ని మంచు ఫ్యామిలీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ‘మా’ భవన్ నిర్మాణం పై మంచు మోహన్‌ బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. గతంలో ‘మా’ భవనం కోసం ఒక స్థలం కొన్నారు. అయితే, రూపాయికి కొన్న ఆ స్థలాన్ని మధ్యలో ఏవేవో కారణాలు చెప్పి అర్థ రూపాయికే అమ్మేశారు. అలా మా భవనం కోసం కొన్న స్థలాన్ని అమ్మడం ఎంతవరకు […]

Written By: , Updated On : August 22, 2021 / 04:51 PM IST
Follow us on

  Mohan Babu Comments on Chiru

Mohan Babu Comments on Chiru: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ భనన నిర్మాణాన్ని మంచు ఫ్యామిలీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ‘మా’ భవన్ నిర్మాణం పై మంచు మోహన్‌ బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. గతంలో ‘మా’ భవనం కోసం ఒక స్థలం కొన్నారు. అయితే, రూపాయికి కొన్న ఆ స్థలాన్ని మధ్యలో ఏవేవో కారణాలు చెప్పి అర్థ రూపాయికే అమ్మేశారు. అలా మా భవనం కోసం కొన్న స్థలాన్ని అమ్మడం ఎంతవరకు సమంజసం ? అంటూ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.

అయితే, గతంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కోసం కొన్న స్థలాన్ని అమ్మే విషయంలో చాలా మంది ప్రముఖుల ఇన్ వాల్వ్ అయి ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ఉండటం విశేషం. మరీ మోహన్ బాబు చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్స్ చేశారా ? లేక మిగిలిన సభ్యులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా ? అనేది మోహన్ బాబుకే తెలియాలి.

ఈ రోజు ‘మా’ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండస్ట్రీలోని ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో మోహన్‌ బాబు ‘మా భవనం కోసం గతంలో ఉన్న స్థలం గురించే ప్రముఖంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, మోహన్ బాబు చేసిన వ్యాఖ్యల్లో ఒకటి మాత్రం చాలా స్పష్టం అర్ధం అవుతుంది.

‘మా’ అసోసియేషన్ కి సంబంధించిన ఫండ్స్ లో గతంలో కొన్ని అవకతవకలు జరిగాయి. అయినా ‘మా’ బిల్డింగ్‌ కోసం స్థలం కొని దాన్ని సగం ధరకు అమ్ముతుంటే.. సినీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదు ? ఇప్పటికైనా ‘మా’ అసోసియేషన్ లో నీతిగా నిజాయితీగా ఉన్న వారిని పెడితే సంస్థకు మంచిది.

ఇక త్వరలోనే మా ఎన్నికలు పెడతారని మోహన్‌ బాబు అన్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు ఎన్నికలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారని.. అతి త్వరలోనే కృష్ణం రాజు సరైన నిర్ణయం తీసుకుంటారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.