Manchu Laxmi Husband: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి తెలియిన వారుండరు. మంచు వారి వారసురాలైన ఈమె సినిమాల్లో తక్కువ కనిపించినా.. తనదైన ప్రవర్తనతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలను ఆమె ప్రత్యేకంగా నిర్మించారు కూడా. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ వ్యాఖ్యలు ఎప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల మంచు లక్ష్మికి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ భర్త ఎవరూ అనే దానిపై చాలా మందికి సందేహం ఉంది. అయితే ఆమెకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఇటీవల బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సినీ సెలబ్రెటీలు పెళ్లిళ్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. నచ్చిన వారితో కలిసుంటూ.. నచ్చని వారికి దూరం పెడుతారు. పెళ్లి చేసుకున్న తరువత కూడా భర్త నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకుంటారు. ఇదే తరహాలో మంచు లక్ష్మీ మాత్రం తన కాలేజీ స్నేహితుడు శ్రీనివాస్ ను ప్రేమించించి.. ఆ తరువాత పెళ్లికి రెడీ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్ లో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు
ఆ తరువాత కొన్నాళ్ల పాటు కలిసున్న వీరు ఒక సందర్భంగా తండ్రి మోహన్ బాబు ఇంటికి మంచు లక్ష్మి వచ్చిందట. అప్పటికీ వారి పెళ్లికి ఇష్టపడని మోహన్ బాబు తన కూతురుతో ఆ పెళ్లి విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందట. దీంతో మంచు లక్ష్మీని ఎలాగైనా ఒప్పించి ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండేలా చేశారట. చివరికి మంచు లక్ష్మీ భర్తతో విడాకులు తీసుకుందట. అయితే ఆ తరువాత తన మైండ్ సెట్ బాగుండాలని ఆమెను అమెరికాకు పంపిచారట.
అక్కడా ఓ వ్యక్తిని మంచు లక్ష్మీ ప్రేమించడంతో చివరికి ఆమెను తీసుకొచ్చిన మోహన్ బాబు ఇక్కడ ఆండ్రు శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారని సమాచారం. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఎవరితో కలిసి ఉండక ఒంటరిగానే ఉంటోంది. అయితే ఇటీవల ఆమె భర్తపై చర్చకు రావడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మిగతా వాళ్ల లాగే మంచు లక్ష్మి వారిది కూడా ప్రేమంచుకొని పెళ్లి చేసుకొని ఆ తరువాత విడిపోయారు.