https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న మెగాస్టార్… ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి..?

ఇండస్ట్రీ లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు...అందులో రామ్ చరణ్ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను చూస్తూ ముందుకు దూసుకుపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 08:47 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan: చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక తన రెండో సినిమా అయిన ‘మగధీర ‘ మూవీని దర్శక ధీరుడు అయిన రాజమౌళి డైరెక్షన్ లో చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఒక ఇండస్ట్రీ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అలాంటి రామ్ చరణ్ సుకుమార్ తో చేసిన రంగస్థలం సినిమాతో రెండో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నటుడిగా కూడా తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఆ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శనను కనబరిచి ఇండస్ట్రీలో ఎవరికి దక్కని ఒక సపరేట్ క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు…ఇక రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో అయితే ఏకంగా ‘గ్లోబల్ స్టార్ ‘ గా అవతరించి పాన్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు… ఇక ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో గానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గాని థియేటర్లోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ చాలా నిదానంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే తన సినిమా విషయం లో ప్రతి చిన్న పాయింట్ ను చాలా క్లారిటీగా చూసుకునే శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తున్నందుకు ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ను కొడతాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…

    ఇక మరి కొంతమంది మాత్రం రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుడిని ఏ మాత్రం అలరించలేదు. కాబట్టి శంకర్ తన ఫామ్ ను కోల్పోయాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. కానీ ఇంకొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం శంకర్ కి గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ పడుతుంది. అది కూడా రామ్ చరణ్ తన మేనియాతో శంకర్ కు ఒక భారీ హిట్ ఇవ్వబోతున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

    ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో మెగాస్టార్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ గత కొద్ది రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. నిజానికి మెగాస్టార్ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కాదు. మలయాళ సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి…అయితే ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…

    అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఈ న్యూస్ మీద విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లు తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే…

    Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…