Lokesh Kanagaraj Telugu Debut: కోలీవుడ్ లో ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిన లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj), రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ చిత్రాన్ని తీసి కెరీర్ లో మొట్టమొదటిసారి ఫ్లాప్ ని ఎదురుకున్నాడు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం 600 కోట్లను రాబట్టాలి. కాబట్టి కమర్షియల్ గా ఫ్లాప్ అనే చెప్పాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చింది కానీ, తమిళనాడు లో మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ చిత్రం. దీంతో లోకేష్ కనకరాజ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ని వదిలి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
రీసెంట్ గానే ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక కథ ని వినిపించాడని, ఆయనకు బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పాడని, త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చూడబోతున్నాం అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్త వచ్చిన పక్క రోజే, అల్లు అర్జున్ కి కథ వినిపించాడని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని వార్తలు వినిపించాయి. ఈ రెండిట్లో ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం చేసుకోలేక అభిమానులు మెంటలెక్కిపోయారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ రెండు కూడా నిజమైన వార్తలే. పవన్ కళ్యాణ్ కి వినిపించిన స్టోరీ వేరు, అదే విధంగా అల్లు అర్జున్ కి వినిపించిన స్టోరీ కూడా వేరు. వీళ్లిద్దరికీ మాత్రమే కాకుండా ప్రభాస్ కి కూడా ఆయన కొంతకాలం క్రితం ఒక కథ ని వినిపించాడు, ఇది కూడా ఓకే అయ్యిందట.
ఈ ముగ్గురి హీరోలతో త్వరలోనే లోకేష్ కనకరాజ్ సినిమాలు చేయబోతున్నాడు. అయితే ముందుగా ఎవరితో చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ #AA22 తో, అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం తో ఫుల్ బిజీ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. కాబట్టి ఆయన తోనే ముందుగా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకు పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ గా ఉంటాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతాడట. ఆ క్రమం లో ముందుగా లోకేష్ కనకరాజ్ మూవీ ని చేస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించనుంది.