Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన రూ.25 కోట్లకు ఇంటిని అమ్మేశాడు అని తెలియగానే అందరూ షాక్ అయ్యారు. అమితాబ్ కి అంత కష్టం ఏమి వచ్చింది అంటూ చర్చ పెట్టారు. అమితాబ్ కి ఎలాంటి కష్టం రాలేదు. అమితాబ్ ఎందుకు ఇల్లు అమ్మేశాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేశ రాజధాని ఢిల్లీలోని తన ఇంటిని భారీ ధరకు అమ్మేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకు అమ్మేశాడు అనే విషయంలో చాలా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ విషయం పై తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ఏమిటంటే .. ‘సోపన్’ పేరుతో పిలిచే ఆ భవంతిని ఆయన కుటుంబానికి సన్నిహితుడైన నెజోన్ గ్రూప్ సీఈవో అవనీకి రూ.25 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట. సినిమాల కోసం ముంబైలో సెటిల్ అయిన అమితాబ్.. ఢిల్లీకి వెళ్లడం తగ్గిపోవడంతో దాన్ని అమ్మేసినట్లు సమాచారం.
Also Read: అసదుద్దీన్ ఒవైసీ పై హత్యాయత్నం.. నాలుగు రౌండ్లు కాల్పులు.. సంచలన నిజాలు
మొత్తానికి అమితాబ్ ఇల్లు అమ్మడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులు కాదు నాయి తేలిపోయింది. అయినా పెళ్లి చేసి చూడు – ఇల్లు కట్టి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండిటికి అంచనాలకు మించిన ఖర్చులుంటాయి, అందుకే ముందు నుంచీ ఇల్లు ఎక్కువుగా కొంటూ వాటినే అద్దెకు ఇస్తూ వచ్చారు. ఒకవిధంగా ఆయనకు అందులోనే ఎక్కువ లాభం కనిపిచింది.

పైగా అమితాబ్ అపార్ట్మెంట్స్ లో ఎక్కువగా సినిమా వాళ్లే ఉంటారు. గ్లామర్ బ్యూటీ కృతి సనన్ కూడా అమితాబ్ అద్దె ఇంట్లోనే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కి ముంబై లాంటి మహానగరంలో చాలా అపార్ట్ మెంట్ లున్నాయి. కాగా అమితాబ్ కి చెందిన అపార్ట్మెంట్ ని అద్దెకు తీసుకొని అందులోకి షిఫ్ట్ అయిపోయింది కృతి సనన్.
Also Read: పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావాలి
[…] DJ Tillu: ‘డీజే టిల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినీ జర్నలిస్టు సురేష్ కొండేటి వెకిలి ప్రశ్నలు అంటూ మీడియాలో సురేష్ కొండేటి పై విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏమి జరిగింది ? నిజంగానే సురేష్ కొండేటి ఇలాంటి నీచమైన కామెంట్లు చేశాడా ? అసలు సురేష్ కొండేటి సినీ జర్నలిస్టు కాదా ?, ముందుగా సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న దగ్గరకు వద్దాం. […]