Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు గారి మరణాన్ని ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. రెబల్ స్టార్ మరణవార్త ఆయన సతీమణి శ్యామలాదేవిని శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా కృష్ణంరాజు గారి భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు తరలించేముందు శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. నిజానికి శ్యామలాదేవి గారిని కుటుంబ సభ్యులు ఉక్కు మనిషి అని పిలుస్తారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో పరిష్కరించడంలో ఆమె నేర్పరి.

ఎంత కష్టకాలం వచ్చినా.. చివరకు తన భర్త మరణించిన సమయంలో కూడా ఆమె తట్టుకుని నిలబడి.. కుటుంబానికి దైర్యం చెబుతూ కనిపించారు. కానీ, రెబల్ స్టార్ అంత్యక్రియల్లో మాత్రం శ్యామలాదేవి గుండెలవిసేలా రోధించారు. శ్యామలాదేవి కన్నీళ్ళను చూసిన తెలుగు సినీ ప్రముఖులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణంరాజుకి శ్యామలాదేవి భార్య అయినా.. ఆయనను ఆమె ఒక బిడ్డలా చూసుకునేవారు. పెళ్లి జరిగినప్పటి నుంచి కృష్ణంరాజుకి కావాల్సిన ప్రతిదీ శ్యామలాదేవిగారే చూసుకునేవారు.

చివరకు బాత్ రూమ్ కి తీసుకెళ్లి తీసుకురావడం వరకూ, అలాగే కృష్ణంరాజుకి సంబంధించిన ప్రతి కార్యక్రమం శ్యామలాదేవి చేతుల మీదుగానే జరిగేది. కానీ, తన భర్త ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శ్యామలాదేవి బిగ్గరగా ఏడుస్తూ గుండె పగిలేలా విలపించింది. శ్యామలాదేవి అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. అలాంటి ఆమె కన్నీళ్లు చూసి ఆ కుటుంబం మొత్తం ఇంకా రోదించింది.
కృష్ణంరాజు పిల్లలు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గుండెలవిసేలా విలపించారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజును కడసారి చూపుకోసం ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు.