Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kiraak Boys Khiladi Girls: అనసూయను భర్తతో వేరు చేయాలని కుట్ర... షాకింగ్ మేటర్ బయటపెట్టిన...

Kiraak Boys Khiladi Girls: అనసూయను భర్తతో వేరు చేయాలని కుట్ర… షాకింగ్ మేటర్ బయటపెట్టిన స్టార్ యాంకర్! అసలు ఏం జరిగింది?

Kiraak Boys Khiladi Girls: యాంకర్ అనసూయ భరద్వాజ్ లాంగ్ గ్యాప్ తర్వాత బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో బిజీ కావడంతో దాదాపు రెండున్నర ఏళ్ళు స్మాల్ స్క్రీన్ మీద అనసూయ కనిపించలేదు. ఊహించని విధంగా ఓ టీవీ షో తో కమ్ బ్యాక్ ఇచ్చింది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘ కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ‘ అనే గేమ్ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అమ్మాయిల టీం లీడర్ గా అనసూయ ఉంది. ఇక అబ్బాయిలకు శేఖర్ మాస్టర్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు.

దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ క్రమంలో అనసూయ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తనను తన భర్త సుశాంక్ నుంచి విడగొట్టేందుకు కుట్ర జరిగిందంటూ సంచలన విషయాన్ని అనసూయ బయట పెట్టింది. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ ఎన్సీసీ క్యాంప్ లో వారి మధ్య పరిచయం ఏర్పడింది.

అది ప్రేమగా మారింది. చాలా కాలం పాటు అనసూయ, సుశాంక్ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సమయంలో వారిని విడగొట్టాలని చాలా కుట్రలు జరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ ఎన్సీసీ ట్రైనర్ వెల్లడించింది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి ఆమె సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూసి అనసూయ షాక్ అయింది. ఈ క్రమంలో ఎన్సీసీ టీచర్ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టారు.

ఆమె మాట్లాడుతూ .. ఎవరు లైన్ వేస్తారో అని అబ్బాయిలకు కనపడకుండా అనసూయను దాచేసేదాన్ని. అనసూయను నేను చాలా స్ట్రిక్ట్ గా చూసుకున్నాను. సుశాంక్ ని ఈమెను విడగొట్టాలని చాలా ప్రయత్నం చేశాను అని అన్నారు. అనసూయ మధ్యలో కల్పించుకుంటూ.. ఈ మేడం వల్లే ఆ రోజుల్లో నేను, సుశాంక్ ఒక్క ఫోటో కూడా దిగలేకపోయాం. అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప 2 తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.

 

RELATED ARTICLES

Most Popular