https://oktelugu.com/

KGF 3: మళ్ళీ తెరపైకి వస్తున్న కేజీఎఫ్ 3… ఎప్పుడు స్టార్ అవుతుందంటే..?

భారీ ఎలివేషన్స్ , ఎమోషన్స్ మధ్య సాగే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 12:54 PM IST

    KGF 3 Movie Latest Updates

    Follow us on

    KGF 3: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాని రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలో కే జి ఎఫ్ కి సీక్వెల్ గా కేజిఎఫ్ 2 సినిమా వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమాలో హీరో అయిన యశ్(Yash) తన నటన తో మెప్పించగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో స్టైలిష్ మేకింగ్ తో ప్రేక్షకులందరిని కట్టిపడేసాడనే చెప్పాలి.

    భారీ ఎలివేషన్స్ , ఎమోషన్స్ మధ్య సాగే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక దానికి తగ్గట్టుగానే కేజిఎఫ్ 3 సినిమా కూడా ఉండబోతుందని దర్శకుడు కేజీఎఫ్ 2 చివర్లో హింట్ అయితే ఇచ్చాడు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన వార్త మరొకసారి సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది.

    అది ఏంటి అంటే సలార్ 2 సినిమా తీసిన తర్వాత ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సబ్జెక్ట్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సలార్ 2 చేసి ఆ తర్వాత కే జి ఎఫ్ 3 మీదికి వెళతాడు.

    అయితే కేజిఎఫ్ 3 లో యశ్ హీరోగా ఉంటాడా ఇంకెవరినైనా కొత్త హీరోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే కేజిఎఫ్ 3 సినిమా మాత్రం పక్కగా ఉంటుంది అని అభిమానులు ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ తో చేసే సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు…