Keerthi Suresh సూపర్ స్టార్ మహేష్ బాబు… పరశురాం దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్… పుట్టిన రోజు కానుకగా ఆమె స్టైలిష్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహానటి ఘన విజయం తర్వాత కీర్తికి సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ఈ తరుణంలో ఈ మూవీపై చాలా ఆశలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కానుంది.
Team #SarkaruVaariPaata wishes the amazingly talented & beautiful actress @KeerthyOfficial a very Happy Birthday ❤️
Super 🌟 @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus @SVPTheFilm @saregamasouth#HBDKeerthySuresh pic.twitter.com/Q34UBEB9O0
— Mahesh Babu Global FC (@SSMBGlobalFC) October 17, 2021
2021 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారై ఉండగా… ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ కు గురి చేశారు జక్కన్న. జనవరి 12 నుంచి వరుసగా మూడు రోజులు పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’, మహేష్ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ అయి ఉండగా… 7న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడమేంటని పలు ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తాయి. ఈ తరుణంలో సర్కారు వారి పాట చిత్ర విడుదల తేదీలో ఈ మార్పు లేదని అర్దం అవుతుంది.