Mahesh Babu – Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మొదట తెలుగులో ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికి ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ వరకు తన ప్రయాణాన్ని విస్తరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన చేసే సినిమాల స్కేల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఆయన సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందించాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు… ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం…
ఇక ఈ సినిమా మీద ఇప్పటికే చాలా రకాల వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి అందులో ఏ వార్త నిజం అనేది తెలియాలంటే సినిమా యూనిట్ అఫిషియల్ గా స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
అది ఏంటి అంటే ఈ సినిమాలో కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో అయిన కార్తీ ఒక కీలకపాత్ర నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. కార్తీ ఇప్పటికే రాజమౌళి చెప్పిన మేకవర్లో బిజీగా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి… మరి ఈ వార్తల మీద సినిమా యూనిట్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనౌన్స్ మెంట్ ను ఇవ్వలేదు. కాబట్టి ఇది నిజమా, అబద్దమా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అంటూ ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు.