https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలకపాత్ర లో నటించనున్న కన్నడ స్టార్ హీరో…

చిరంజీవి అనే పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ప్రతి ప్రేక్షకుడికి గుర్తుండి పోతుంది... ఇక తన కెరియర్ లో ఆయన చేయని పాత్ర లేదు, ఆయన సాధించని విజయం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 08:41 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నటుడు మెగాస్టార్ చిరంజీవి…ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 70% షూట్ కంప్లీట్ అయినప్పటికీ ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వశిష్ట విశ్వంభర సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ లో చిరంజీవి, త్రిష ల మీద కొన్ని సీన్స్ ని చిత్రీకరించారట. ఇక మొత్తానికైతే చిరంజీవి మరొకసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం చిరంజీవి కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ని ఈ సినిమాలో తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఆ క్యారెక్టర్ కోసం మొదట కొంతమంది నటులను అనుకున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఫైనల్ గా ఉపేంద్ర కి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఉపేంద్ర కూడా స్వతహాగా తనది కన్నడ ఇండస్ట్రీ అయినప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఆయనకి చాలా మంచి అనుబంధమైతే ఉంది. ఒకప్పుడు ఆయన తెలుగులో కూడా మంచి సినిమాలను చేసి భారీ విజయాలను అందుకున్నాడు.

    Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…

    ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించి ఆ సినిమా విజయంలో తను కూడా ఒక ముఖ్య భూమికను పోషించాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవితో పాటు ఉపేంద్ర మీద వచ్చే కొన్ని సీన్లని తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ని చేసే ప్రయత్నం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పటికే దానికోసం సిటి ఔట్ కట్స్ లో ఒక భారీ సెట్ రెడీ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఉపేంద్ర ఈ సినిమాలో నెగటివ్ పాత్ర చేస్తున్నాడా? లేదంటే పాజిటివ్ పాత్రలో నటిస్తున్నాడా? అనే విషయాల పట్ల ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ ఆయన మాత్రం ఈ సినిమాలో తప్పకుండా నటిస్తున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో చిరంజీవి పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ ను కొట్టి తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ‘సైరా ‘ సినిమాతో చిరంజీవి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే బాలీవుడ్ లో తన మార్క్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

    Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది