Homeఎంటర్టైన్మెంట్Bimbisara Collections: 31వ రోజు కూడా ‘బింబిసార’కి భారీ కలెక్షన్స్.. సంబరాల్లో...

Bimbisara Collections: 31వ రోజు కూడా ‘బింబిసార’కి భారీ కలెక్షన్స్.. సంబరాల్లో నందమూరి అభిమానులు

Bimbisara Collections: బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 31వ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో 11 లక్షల దాకా షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 18 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

Bimbisara Collections
kalyan ram

ముందుగా ‘బింబిసార’ సినిమా 31 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 11.70 కోట్లు,

సీడెడ్ 8.00 కోట్లు,

ఉత్తరాంధ్ర 4.87 కోట్లు,

ఈస్ట్ 2.01 కోట్లు,

వెస్ట్ 1.50 కోట్లు,

గుంటూరు 2.26 కోట్లు,

కృష్ణా 1.63 కోట్లు,

నెల్లూరు 0.95 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 31 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 32.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 65.83 కోట్లు వచ్చాయి. 31 వ రోజు కూడా ఈ సినిమా 11 లక్షలు కలెక్ట్ చేయడం గొప్ప విషయమే.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.32 కోట్లు,

ఓవర్సీస్ 2.40 కోట్లు,

టోటల్ వరల్డ్ వైడ్ గా 31 డేస్ కలెక్షన్స్ గానూ ‘బింబిసార’ రూ. 37.64 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 75:28 కోట్లను కొల్లగొట్టింది. ఇక 31వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 18 లక్షలు కలెక్ట్ చేసింది.

Bimbisara Collections
kalyan ram

 

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ఇప్పటివరకు బయ్యర్లకు రూ.21.62 కోట్ల లాభాలను అందించింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version