Sita Ramam Collections: హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 41.87 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి హీరో ‘దుల్కర్ సల్మాన్’కి తెలుగులో మళ్ళీ మరో భారీ హిట్ పడింది. నిజానికి మొదటి షో నుంచి ఈ సినిమా పై మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ పరిస్థితి బాగుంది. అటు యూఎస్ఏ లోనూ ఈ చిత్రం నేటితో అక్కడ బాక్సాఫీస్ వద్ద 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటింది. ఇది ఊహించని కలెక్షన్స్. మరి ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ? చూద్దాం రండి.

ముందుగా ‘సీతా రామం’ 31 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 9.78 కోట్లు
సీడెడ్ 1.90 కోట్లు
ఉత్తరాంధ్ర 3.55 కోట్లు
ఈస్ట్ 1.96 కోట్లు
వెస్ట్ 1.26 కోట్లు
గుంటూరు 1.67 కోట్లు
కృష్ణా 1.77 కోట్లు
నెల్లూరు 0.89 కోట్లు
ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 31 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 22.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 45.53 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.83 కోట్లు
ఓవర్సీస్ 7.12 కోట్లు
మిగిలిన వెర్షన్లు 8.07 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 31 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 41.87 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 83.72 కోట్లను కొల్లగొట్టింది

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. అసలు ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలను పెద్దగా చూడటం లేదు. కానీ.. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరించడం విశేషమే. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.23.84 కోట్ల లాభాలను అందించింది.