Kalki 2898 AD Trailer
Kalki 2898 AD Trailer: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు కల్కి 2829 AD ట్రైలర్ కోసం వేచి చూస్తున్నారు. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కల్కి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కల్కి నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ హైప్ క్రియేట్ చేసేలా ఉంటుంది.
ఇక కల్కి టీం చాలా వినూత్నంగా మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భైరవ స్నేహితుడు బుజ్జిని ఇటీవల పరిచయం చేశారు. గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి బుజ్జి కారును ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ద్వారా కల్కి మూవీ పై ఓ హింట్ ఇచ్చారు. అయితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కల్కి ట్రైలర్ విడుదల పై క్రేజీ అప్డేట్ వచ్చింది.
ఈ క్రమంలో జూన్ 10న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక చెప్పిన విధంగానే ప్రభాస్ కల్కి మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా కల్కి ట్రైలర్ ఎంపిక చేయబడిన కొన్ని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు కొన్ని ఆసక్తికర పోస్టర్స్ పంచుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సిల్వర్ స్క్రీన్ పై కల్కి 2829 AD ట్రైలర్ ఎంజాయ్ చేయవచ్చు.
కాగా ట్రైలర్ సినిమా పై ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.
Web Title: Kalki 2898 ad trailer release tomorrow big surprise for prabhas fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com