Kalki 2898 AD Collections: సోలోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల రికార్డు లేపేసిన ప్రభాస్… అక్కడ కల్కి ప్రభంజనం!

కల్కి హిందీ వెర్షన్ రూ. 150 కోట్ల మార్క్ దాటింది. రెండు వందల కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఏరియాల్లో కల్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ కి దగ్గరైంది. తమిళనాడు, కేరళలో మాత్రం కల్కి చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. కల్కి వసూళ్ల పరంగా ఆ రెండు రాష్ట్రాల్లో వెనకబడింది. యూఎస్ లో మాత్రం కల్కి చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు మించి కల్కి యూఎస్ లో పెర్ఫార్మ్ చేస్తుంది.

Written By: Gopi, Updated On : July 7, 2024 11:15 am

Kalki 2898 AD Collections

Follow us on

Kalki 2898 AD Collections: కల్కి 2829 AD వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ సరికొత్త ప్రయోగం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఓ ఏరియాలో సోలోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల రికార్డు బ్రేక్ చేశాడు ప్రభాస్. కల్కి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మొదటి షో నుండే కల్కి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కల్కి వసూళ్ళు కుమ్మేస్తుంది. కల్కి వరల్డ్ వైడ్ రూ. 800 కోట్ల వసూళ్లను అధిగమించినట్లు మేకర్స్ తెలియజేశారు.

కల్కి హిందీ వెర్షన్ రూ. 150 కోట్ల మార్క్ దాటింది. రెండు వందల కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఏరియాల్లో కల్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ కి దగ్గరైంది. తమిళనాడు, కేరళలో మాత్రం కల్కి చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. కల్కి వసూళ్ల పరంగా ఆ రెండు రాష్ట్రాల్లో వెనకబడింది. యూఎస్ లో మాత్రం కల్కి చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు మించి కల్కి యూఎస్ లో పెర్ఫార్మ్ చేస్తుంది.

కల్కి నార్త్ అమెరికా లో $15.3 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 129. 38 కోట్లు. దీంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డు కల్కి అధిగమించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ యూఎస్ లో రన్ ముగిసే నాటికి $14. 3 మిలియన్ వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కంబైన్ గా నెలకొల్పిన రికార్డును ప్రభాస్ సోలోగా లేపేశాడు. బాహుబలి 2 రికార్డు దిశగా కల్కి అడుగులు వేస్తుంది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి 2 యూఎస్ లో $20 మిలియన్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ వారం కూడా కల్కి చిత్రానిదే. ఎలాంటి మేజర్ రిలీజ్లు లేవు. జులై 12న భారతీయుడు 2 విడుదల కానుంది.అప్పటి వరకు కల్కి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కల్కికి పోటీ లేదు. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ఇతర ప్రధాన పాత్రలు చేశారు. రాజేంద్రప్రసాద్, శోభన, పశుపతి కీలక రోల్స్ చేశారు. దుల్కర్, మృణాల్, విజయ్, రాజమౌళి, ఆర్జీవీ గెస్ట్ రోల్స్ లో సందడి చేశారు.