https://oktelugu.com/

Akkineni Family: అఖిల్ తో పోలిస్తే నాగార్జున నాగ చైతన్య కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదా..?

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు సెకండ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇస్తే, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వర రావు కొడుకు గా నాగార్జున కూడా ఎంట్రీ ఇచ్చి, తనదైన మార్క్ నటన ను చూపిస్తూ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : February 13, 2024 / 12:11 PM IST
    Follow us on

    Akkineni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు కండ్లు గా చెప్పుకునే ఎన్టీఆర్, నాగేశ్వరరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచారనే చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు లు కూడా తమదైన రీతిలో ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకున్నారు.

    ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు సెకండ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇస్తే, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వర రావు కొడుకు గా నాగార్జున కూడా ఎంట్రీ ఇచ్చి, తనదైన మార్క్ నటన ను చూపిస్తూ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడోవ జనరేషన్ హీరోలుగా నాగార్జున కొడుకులు అయిన నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరూ వరుసగా సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోలు అవుతారని అందరూ అనుకున్నారు.

    కానీ వాళ్లు ప్రస్తుతం ఒక సినిమా హిట్ కొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున నాగచైతన్య కంటే కూడా అఖిల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అంటూ పలు రకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అఖిల్ కోసం భారీ డైరెక్టర్ లను సెట్ చేసే పనిలో నాగార్జున ఉంటున్నాడు. నాగచైతన్య విషయంలో మాత్రం అలాంటి చొరవ తీసుకోవడం లేదు. ఇక నాగచైతన్య తన సర్కిల్ లో తనకు ఫ్రెండ్స్ గా ఉన్న చందు మొండేటి, శేఖర్ కమ్ముల, సుధీర్ వర్మ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు కానీ, అఖిల్ విషయంలో మాత్రం నాగార్జున వివి వినాయక్, సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ లని సెట్ చేసి వాళ్ళతో సినిమాలు చేయిస్తున్నాడు.

    అయినా కూడా అఖిల్ ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీని నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కలిసి ముందుకు తీసుకెళ్తారా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వాళ్ళ అభిమానుల్లో కలుగుతున్నాయి…