OG New Poster: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా విజయాలను సాధించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఎలక్షన్ ఫలితాలలో కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన వంతు సేవ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఓజీ సినిమా నుంచి ‘టైం బిగిన్స్’ అనే పోస్టర్ రిలీజ్ చేయడంతో అభిమానులు సంబరాలను జరుపుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే సమయానికి ఓజీ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటూ మరికొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. అయితే అభిమానుల్లో ఉన్న ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఓ జి సినిమా మీద మరింత హైప్ పెంచే విధంగానే మేకర్స్ ఇలాంటి ఒక ప్రణాళికను సిద్ధం చేశారంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ కి ముందు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి వచ్చిన టీజర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ చిన్న హ్యాపీ మూమెంట్ వచ్చినా కూడా సినిమా మేకర్స్ దాన్ని వాడుకొని వాళ్ళ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్యేగా, ఇటు హీరోగా ఏక కాలంలో రెండు బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఈ సంవత్సరం ఓజీ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలను పూర్తి చేసి వాటిని రిలీజ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొనబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… చూడాలి మరి ఇక ముందు చేయబోయే సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…