https://oktelugu.com/

Sobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల కి మెగా ఫ్యామిలీ కి మధ్య ఇంత రిలేషన్ ఉందా..ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ అక్కినేని ఇంటికి కోడలిగా త్వరలో అడుగుపెట్టబోతుంది. చాలా కాలం నుండి అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడుపుతున్న శోభిత , ఇటీవలే పెద్దల సమక్షం లో నాగ చైతన్య తో నిశ్చితార్థం జరుపుకుంది. ప్రముఖ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య కి ఇది రెండవ పెళ్లి అనే విషయం మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : August 10, 2024 / 05:58 PM IST

    Sobhita Dhulipala(1)

    Follow us on

    Sobhita Dhulipala: తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. చాలా అరుదుగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వడం ఇది వరకు మనం చూసాము. అలాంటి వారిలో ఒకరు శోభిత దూళిపాళ్ల. ఈమె తెలుగు లో ఎక్కువగా అడవి శేష్ సినిమాల్లోనే కనిపించేది. ఇప్పుడు తెలుగులోకంటే ఆమెకి హిందీ లోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోతకు ఒప్పుకోరని, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించరని అందరు అనుకునే మాట. కానీ శోభిత దూళిపాళ్ల మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈమె ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదు, బాలీవుడ్ లో ఈమె హద్దులు దాటి రొమాన్స్ సన్నివేశాల్లో నటించడం మన కళ్లారా చూసాము.

    ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ అక్కినేని ఇంటికి కోడలిగా త్వరలో అడుగుపెట్టబోతుంది. చాలా కాలం నుండి అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడుపుతున్న శోభిత , ఇటీవలే పెద్దల సమక్షం లో నాగ చైతన్య తో నిశ్చితార్థం జరుపుకుంది. ప్రముఖ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య కి ఇది రెండవ పెళ్లి అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే సమంత తో దాంపత్య జీవితం గడుపుతున్న సమయంలోనే శోభిత తో రిలేషన్ లో ఉన్నాడా?, లేక ఆమెతో విడిపోయిన తర్వాత రిలేషన్ లో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే శోభిత దూళిపాళ్ల కి, మెగా ఫ్యామిలీ కి మధ్య రిలేషన్ ఉంది అనే విషయం మీకెవరికైనా తెలుసా?, అది కూడా ఎవరితోనో కాదు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఇంకా దగ్గరైన సంబంధం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ లో టాప్ 2 నాయకుడిగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ తో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. తెనాలి లో ఆయన మార్క్ పాలన, దూకుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చలకు దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే. శోభిత దూళిపాళ్ల కూడా తెనాలి కి సంబంధించిన అమ్మాయి. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే పలు సందర్భాలలో తెలిపింది.

    అంతే కాదు ఆమె తండ్రితో నాదెండ్ల మనోహర్ కి మంచి సాన్నిహిత్య సంబంధం కూడా ఉందట. జనసేన పార్టీ లో అతి ముఖ్యమైన నాయకుడైన నాదెండ్ల మనోహర్ తో శోభిత దూళిపాళ్ల కి పరిచయం ఉందనే విషయం తెలుసుకొని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చెయ్యడం లేదు. బాలీవుడ్ లో మాత్రం రెండు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. ఈ చిత్రాలు పూర్తి అయ్యాక శోభిత దూళిపాళ్ల సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పబోతుందని టాక్. నాగ చైతన్య కేవలం ఆ ఒప్పందం మీదనే శోభిత తో పెళ్ళికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.