Shankar And NTR: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ మొదటి పాన్ ఇండియా దర్శకుడుగా కూడా తనదైన రీతిలో సత్తాను చాటుకున్నాడు.ఇక రోబో సినిమాతో ఈయన మొదటిసారిగా పాన్ ఇండియాలో సినిమాని రిలీజ్ చేసి భారీ సక్సెస్ నైతే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇలాంటి శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే శంకర్ చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇద్దరికీ సెట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ కొట్టి ఎన్టీఆర్ తో భారీ గ్రాఫికల్ మూవీ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా లైనప్ ను కనక చూసుకున్నట్లైతే ఇప్పుడు దేవర, వార్ 2 అనే సినిమాలను చేస్తున్న ఈయన ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే ఈ గ్యాప్ లో శంకర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వస్తే ఆ సినిమా మీద భారీ అంచనాలైతే ఉంటాయి.
ఇక శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ సక్సెస్ సాధిస్తే మరోసారి శంకర్ పాన్ ఇండియాలో తన పంజాని విసురుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఎన్టీఆర్ కూడా దేవర అనే సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన కూడా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మరోసారి సోలోగా భారీ సక్సెస్ సాధించిన హీరోగా కూడా గుర్తింపు పొందుతాడు…