https://oktelugu.com/

Balakrishna: బాలయ్య సినిమాలు హిట్ అవ్వడానికి సీక్రెట్ అదేనా..?

బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కానీ బాలయ్య మాత్రం సూపర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈయనను చూసి ఎందరో నేర్చుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 5, 2024 / 12:50 PM IST
    Follow us on

    సినిమా రంగంలో రాణించాలంటే చాలా విషయాలను గుర్తు పెట్టుకోవాలి. కొన్ని విషయాలకు కాంప్రమైజ్ కావాలి. ఇదొక రంగుల ప్రపంచం. ఎలాంటి సందర్బాలు అయిన ఎదురవుతాయి. కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయితే మరొకొందరు స్టార్లు అయినా కూడా ఆఫర్లు లేకుండా చతికిల పడతారు. అయితే సీనియర్ యాక్టర్లు మాత్రం తమ సత్తా చాటుతూ ఇండస్ట్రీలో దూసుకొని పోతున్నారు. అందులో బాలకృష్ణ ఒకరు. ఈయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం ఫేమస్ అవుతుంటాయి. మరి ఆయన సక్సెస్ కు సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా?

    బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కానీ బాలయ్య మాత్రం సూపర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈయనను చూసి ఎందరో నేర్చుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. బాలయ్య సూట్ అయ్యే కథలను ఎంచుకోవడంతో పాటు ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు? తన సినిమాల నుంచి ఎలాంటి అంశాలు కావాలనుకుంటున్నారు? అనే విషయాల గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈయన సక్సెస్ కు సీక్రెట్ కూడా ఇదే అంటారు చాలా మంది.

    ఒకప్పుడు ఫ్లాప్ ల వల్ల ఇబ్బందులు పడ్డ బాలయ్య ఇప్పుడు మాత్రం కథల విషయంలో జాగ్రత్త పడటం వల్లే బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుంటున్నారట. అంతేకాదు దర్శకులను ఎంపిక చేసుకునే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తనను డీల్ చేసే సత్తా ఉన్న దర్శకులకు మాత్రమే సినిమా ఆఫర్లు ఇస్తున్నారు బాలయ్య. అయితే ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాలు నటిస్తుంటారు బాలయ్య. అంతే కాదు ఒక సినిమాకు సంబంధించిన తప్పులు మరో సినిమాలో జరగకుండా చూసుకుంటారట.

    ఇక వరుస విజయాల వల్ల బాలయ్య పారితోషికం ఏకంగా రూ. 30 కోట్లకు చేరింది. ఈయన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతాయనే విషయం తెలిసిందే. నిర్మాతలకు కూడా బాలయ్య సినిమాలు ఊహించని రేంజ్ లో లాభాలను తెచ్చి పెడుతుంటాయి. ఇక ఈయన రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తాయని, సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు.