Prabhas: కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తను చేసిన ఈశ్వర్ సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ వర్షం సినిమాతో ఆయనకు మొదటి కమర్షియల్ హిట్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఆ సినిమాతో వచ్చిన సక్సెస్ ల పరంపరను వరుస సినిమాలతో కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటూ ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ లాంటి ఒక నటుడు సినిమాకి డేట్స్ ఇస్తే చాలు అంటూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శక నిర్మాతలు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు అంటే ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఆయనకి ఎన్ని సినిమాలు చేసినా కూడా కెరియర్ మొదట్లో ఒక సినిమాని రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన ఇప్పటికి బాధపడుతూ ఉంటాడట.
Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…
అయితే అది ఏ సినిమా అంటే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘బృందావనం ‘ సినిమా అని తెలుస్తుంది… మొదట బృందావనం సినిమాని ప్రభాస్ తో చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నాడట. కానీ ప్రభాస్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ సినిమా చేయడానికి వీలుపడలేదు. వంశీ పైడిపల్లికి మున్నా సినిమాతో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. అయినప్పటికీ తనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నాడట.
ఇక అందులో భాగంగానే వంశీ పైడిపల్లి బృందావనం కథ చెప్పినప్పుడు తను చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన పలు సినిమాల్లో బిజీగా ఉండి ఆ సినిమా చేయలేకపోయానని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ చేసిన బృందావనం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కి అప్పట్లో ఒక క్రేజీ స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. ఇక ఇప్పటికి కూడా అలాంటి ఒక క్లాస్ అండ్ మాస్ సినిమా చేసి ఉంటే బాగుండేదని తన సన్నిహితుల దగ్గర ఎప్పుడు చెబుతూ ఉంటాడట…ఇక మొత్తానికైతే ప్రభాస్ ఇప్పుడు సలార్ 2, స్పిరిట్, హను రాఘవ పూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజి సినిమాలను ఏకకాలంలో పూర్తి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
మరి ఈ సినిమాలను కనుక తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేసినట్లయితే ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తాడనే చెప్పాలి…ఇక ఈరోజు రిలీజైన ‘రాజాసాబ్ ‘ గ్లింప్స్ కి కూడా చాలా మంచి పేరు అయితే వచ్చింది. కాబట్టి ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సినిమాని కూడా చాలా బాగా తీసినట్లైతే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తద్వారా మారుతి కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గాఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…