https://oktelugu.com/

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ వల్లే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ ని మారుస్తున్నాడా..? ఇందులో ఎంత నిజం ఉంది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కప్పుడు చేసిన చాలా సినిమాలు వరుస సక్సెస్ లను అందుకున్నాయి. ఇక మద్యలో ఒక 10 సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సక్సెస్ లా పరంపర ను కొనసాగించడానికి సిద్ధం అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 3, 2024 / 01:21 PM IST

    Ustaad Bhagat Singh

    Follow us on

    Ustaad Bhagat Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా ఆటోమేటిగ్గా దాని మీద భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. ఇప్పుడు ఈ మూడు సినిమాల షూటింగ్ ల్లో పాల్గొని వీటిని తొందరగా కంప్లీట్ చేయాలని ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు. కాబట్టి అక్కడ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అస్తవ్యస్తంగా తన పరిపాలనను కొనసాగించడంతో జనాలు తీవ్రమైన నిరాశ చెందుతున్నారు. కాబట్టి వాళ్లలో కొన్ని వెలుగులు నింపిన తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగు లో పాల్గొనాలని అనుకుంటున్నాడు. మరి దాని కోసం ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ ప్రస్తుతానికైతే ఒక మూడు నెలలు పట్టచ్చు అంటూ పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల వారు తెలియజేస్తున్నారు.

    ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీ ని హరీష్ శంకర్ ఎప్పుడో రాశాడు. కాబట్టి ఆ సినిమాలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు అయితే రాశాడు. అలాగే కొన్ని సీన్లను కూడా పెట్టాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వాటిని సినిమాలో పెట్టిన కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు.. కాబట్టి హరీష్ శంకర్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లని డైలాగులను మార్చబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక ఇదే కనక జరిగితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లోకి వచ్చే లోపే తను ఈ మార్పులు చేర్పులు చేసుకొని పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న కూడా ముందు ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తాడు అనేది తెలియడం లేదు. ఎందుకంటే ‘హరిహర వీరమల్లు’ సినిమా స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆ సినిమా కి సంభందించిన 30% షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక మిగిలిన షూట్ ను కూడా కంప్లీట్ చేసి ముందుగా దాన్ని రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు గా తెలుస్తోంది.

    ఇక ఆ సినిమా తర్వాత ఓజీ దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలని లైన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలు ఎప్పుడు షూటింగ్ లను పూర్తి చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కండ్ల తో ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ లను కొట్టడం ఖాయం అంటూ సినిమా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమాలతో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే వరుస సక్సెస్ లను అందుకున్నాడో ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ ల పరంపరను కొనసాగించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు…