Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ చాలా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని తీయడంలో డైరెక్టర్ సుకుమార్ చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. అందువల్లే ఈ సినిమా మీద భారీ రికార్డులైతే కొల్లగొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే మేనరిజం ఎలాగైతే పాపులర్ అయింది ఇప్పుడు పుష్ప 2 లో కూడా అలాంటి మరొక మ్యానరిజంతో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు గా తెలుస్తుంది.
అంటే పుష్ప 2 సినిమాలో తగ్గేదేలే అనే మాట వాడినప్పటికీ దాంతో పాటు మరొక మేనరిజమ్ ను కూడా ఈ సినిమాలో వాడే అవకాశం అయితే ఉంది. ఇక ఆ మ్యానరిజం అయితే థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పుష్ప 2 లో చాలా మరికొన్ని ట్విస్ట్ లతో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నట్టుగా సినిమా యూనిట్ తెలియజేస్తున్నారు. అవి కూడా ప్రేక్షకులను చాలా వరకు థ్రిల్ కి గురిచేస్తాయని సినిమా యూనిట్ తెలియజేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే సుకుమార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకొవాలని చూస్తున్నారు… ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను కొడతారు అనేది మాత్రం పక్కగా అర్థం అవుతుంది…