Mamitha Baiju: సౌత్ ఇండియాలో ప్రస్తుతం మమితా బైజు ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఈమె టాపికే వినిపిస్తుంది. వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ. మరి ఈమె ఎవరు? ఎందుకింత క్రేజ్ సంపాదించింది? ఆమె బ్యాగ్రౌంట్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం..
మలయాళ కుట్టి ఒక్క ప్రేమలు అనే సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించింది. 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఏకంగా 18 సినిమాల్లో నటించింది. అందులో కొన్ని మంచి పేరునే సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ఆపరేషన్ జావా, ఖోఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం వంటి సినిమాలతో ఈమె అందరికి ఫేవరేట్ గా మారింది. ఇక రీసెంట్ గా ప్రేమలు సినిమాతో భారతదేశం నలుమూలల ఈమెకు అభిమానులు పెరిగిపోయారు. అంతేకాదు స్టార్ స్టేటస్ ను కూడా సంపాదించింది.
ప్రేమలు సినిమా మలయాళంలో కాదు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం ఈమె పేరు మారుమోగుతోంది. దీంతో అమ్మడుకు సినిమా ఆఫర్లు వరుసబెట్టి వస్తున్నాయి. అయితే జీవీ ప్రకాష్ కుమార్ సరసన రెబల్ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అంతేకాదు ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట ఈ కుర్ర హీరోయిన్. మరి తెలుగు సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.
గతంలో ప్రియా ప్రకాష్ వారియర్ మాదిరి మెరిసి వెళ్లిపోతుందో.. లేదా సాయి పల్లవి లా స్టార్ డం సంపాదించుకుంటుందో చూడాలి. కానీ సంప్రదాయ దుస్తులకు మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది మమితా. హద్దులు దాటకుండా ట్రెండింగ్, లేటెస్ట్, ఫ్యాషన్ దుస్తులతో కూడా మెరిసిపోతుంటుంది. ఇక తన డ్యాన్స్ తో అయితే ఏకంగా ఇరగదీస్తుంది. మరి ముందు ముందు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.