Women Aging: మాతృత్వం అనేది మహిళలకు దేవుడు ఇచ్చిన వరం. అమ్మతనం కోసం చాలా మంది పరితపిస్తుంటారు. ఆడజన్మకు అదే సార్థకత అని భావిస్తారు. అయితే మహిళ అమ్మగా మారిన తర్వాత ప్రతీ నిమిషం పిల్లల కోసమే ఆలోచిస్తుంది. పిల్లలకే సమయం వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడం కూడా మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి అమ్మ. తమను తాము నిర్లక్ష్యం చేసుకోవడం ద్వారా వహిళలు త్వరగా వృద్ధులు అవుతున్నారు. ఇందుకు కారణాలను తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన..
న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణాలపై అధ్యయనం చేశారు. సుమారు వెయ్యి మంది మహిళలపై పరిశోధన చేశారు. పిల్లలను కన్న తర్వాత మహిళల్లో వస్తున్న డీఎన్‌ఏ మార్పులపై అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆరు విభిన్నమైన ‘ఎపిజెనెటిక్ క్లాక్‌లు’ లేదా డీఎన్‌ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు.
ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో..
ఈ అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతీ గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేల్ల సుదీర్ఘ పరిశోధనలో మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా గర్భిణుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. కొలంబియాలోని ఏజింగ్ సెంటర్‌లో ఈ అంశంపై అసోసియేట్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
= గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని తెలిపారు. ఈ ప్రభావాలు అధిక సంతానోత్సత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు.
= ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యం పెరుగుదల ఎక్కువగా కనిపించినట్లు తెలిపారు. అందుకే గర్భిణిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని పేర్కొన్నారు.
= కొందరికి ధూమపానం అలవాటు, ఆర్థిక పరిస్థితుల కారణంగా సరైన పోషకాహారం తీసుకోలేని పరిస్థితుల కారణంగా జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా పెరుగుతున్నట్లు గుర్తించారు.
= కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి.