Bigg Boss 9 Telugu: నేడు రాత్రి 7 గంటలకు ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభం కానుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు పెద్ద పీట వేస్తూ, వాళ్ళని కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నాము అని ప్రకటన వచ్చిన రోజు నుండే ఈ సీజన్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి. అందుకోసం ‘అగ్నిపరీక్ష’ అనే షోని నిర్వహించి, ఆ షో ద్వారా ఒక 13 మందిని ఎంచుకున్నారు. ఆ 13 మంది వివిధ టాస్కులు ఆడి ఆడియన్స్ ఓటింగ్ ని సంపాదించుకొని తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి నుండి కనీసం 8 మంది అయినా హౌస్ లోపలకు అడుగుపెడుతారని అంతా అనుకున్నారు. కానీ నిన్న జరిగిన గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా కేవలం 5 మంది సామాన్యులు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
ఆ 5 మంది ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజా మరియు మర్యాద మనీష్. వీళ్ళు ఇప్పుడు హౌస్ లోనే ఉన్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే మొత్తం మీద 9 మంది హౌస్ లోకి నిన్న ఎంట్రీ ఇచ్చేశారు. ఆడియన్స్ సెలబ్రిటీల సంఖ్య,సామాన్యుల సంఖ్య సమానంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇంత తక్కువ ఉంటుందని మాత్రం ఊహించలేకపోయారు. నాగ ప్రశాంత్ , షకీబ్ మరియు డిమోన్ పవన్ వంటి వారికి ఆడియన్స్ ఓటింగ్ భారీగానే పడ్డాయట. కానీ వీరిలో ఒక్కరు కూడా లోపలకు వెళ్ళలేదు. ఏ కంటెస్టెంట్ కి లేని విధంగా నాగ ప్రశాంత్ కి రెండు స్టార్స్ వచ్చాయి. కచ్చితంగా ఈయన జడ్జిల క్యాటగిరీలో లోపలకు వెళ్ళిపోతాడని అనుకున్నారు. జడ్జిల సమ్మతి తో పాటు ఆడియన్స్ ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఈయన హౌస్ లోపలకు వెళ్లలేకపోవడం నిజం గా అన్యాయమే అని అంటున్నారు నెటిజెన్స్.
అయితే సెప్టెంబర్ 28 న రీ లాంచ్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా హౌస్ లోపలకు మరో ఆరు మంది కంటెస్టెంట్స్ ని పంపబోతున్నారట. అందులో అగ్నిపరీక్ష నుండి ముగ్గురు సామాన్యులు ఉండే అవకాశం ఉందట. వారిలో నాగ ప్రశాంత్, డిమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే వీళ్ళు హౌస్ లోపలకు అడుగుపెట్టే వరకు,అది మన కళ్ళతో చూసే వరకు నమ్మడానికి లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆరు మంది కంటే ఎక్కువ సామాన్యులు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కానీ చివరికి కేవలం 5 మంది మాత్రమే వెళ్లారు. ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన సామాన్యుల వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ పెరిగితే మళ్లీ వాళ్లనే తీసుకొస్తారు, లేదంటే సినీ సెలబ్రిటీలనే తీసుకొస్తారు. ఇది ఖాయం చేసుకోవచ్చు.