Bigg Boss 6 Telugu Inaya Sultana- Rohit: ఈ వారం చాలా కూల్ గా ఫన్ మరియు సెంటిమెంట్ తో సాగిపోయిన బిగ్ బాస్ హౌస్ ఈరోజు ఒక్కసారిగా హీట్ వాతావరణం కి చేరుకుంది..చివరి కెప్టెన్సీ టాస్కు గా బిగ్ బాస్ ఇచ్చిన ‘గ్రాబ్ & రన్’ టాస్కులో కంటెస్టెంట్స్ అందరూ హోరాహోరీగా తలపడి ఆడారు..ఈ టాస్కులో సర్కిల్ లో ఉన్న బాల్ కోసం ఇంటి సభ్యులందరూ తలబడి ఆ బాల్ ని తీసుకొని బజర్ మోగే వరుకు మరో పోటీ దారులకు చిక్కకుండా తన వద్దనే దాచుకోవాలి.

అలా బజర్ మోగే వరుకు ఎవరైతే బాల్ ని తమ వద్ద ఉంచుకొని కాపాడుకుంటారో..వారిని కెప్టెన్సీ టాస్కు నుండి తొలగించొచ్చు..అలా ఒక్కొక్కరుగా కెప్టెన్సీ టాస్కు నుండి తొలగిపోతూ చివరి వరుకు ఎవరు నిలుస్తారో వాళ్ళే ఇంటి కెప్టెన్ గా నిలుస్తారు..ప్రస్తుతం హౌస్ లో మిగిలి ఉన్న ఇంటి సభ్యులలో ఇప్పటి వరుకు కెప్టెన్ కాకుండా ఉన్నది కేవలం ఇనాయ మరియు రోహిత్ మాత్రమే.
అయితే ఒక రౌండ్ లో బజర్ మోగే సమయానికి ఇనాయ చేతిలో బాల్ ఉంటుంది..అప్పుడు తనకి ఒకరిని కెప్టెన్సీ టాస్కు నుండి తొలగించే అవకాశం రాగా ఆమె రోహిత్ ని ఎంచుకొని కెప్టెన్సీ టాస్కు నుండి తొలగిస్తుంది..అప్పటికే రోహిత్ తో సరిసమానమైన బలవంతులు శ్రీహాన్, ఆది రెడ్డి వంటి వారు కెప్టెన్సీ టాస్కులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరుకు కెప్టెన్ అవ్వలేకపోయిన రోహిత్ ని తొలగించే లోపు రోహిత్ వెక్కిళ్లు పెట్టి మరీ ఏడుస్తాడు.

ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 12 వారాల నుండి ఇప్పటి వరుకు నేను ఇంటి కెప్టెన్ అవ్వలేదు..అందుకే ఈసారి ఎట్టి పరిస్థితి లో కెప్టెన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను..నేను కెప్టెన్ అవ్వాలంటే రోహిత్ ఉండకూడదు..ఎందుకంటే రోహిత్ అన్నా చాలా స్ట్రాంగ్ ప్లేయర్..అతని చేతులోకి బాల్ వెళ్తే కచ్చితంగా రాదు..అందుకే నేను రోహిత్ అన్నని తొలగిస్తున్నాను’ అంటూ చెప్పుకొస్తుంది ఇనాయ..ఈ ఒక్క విషయం లో ఈరోజు ఇనాయ ప్రవర్తించిన తీరుకి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఒక రేంజ్ ట్రోల్ల్స్ పడుతున్నాయి.