Puri Jagannadh: రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీయర్ ని మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ కొన్ని సినిమాలకు ఆయన దగ్గర వర్క్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుస సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన బాచి సినిమా భారీ డిజాస్టర్ అయింది.
దాంతో ఆయనకు అవకాశం ఇచ్చే హీరో కరువయ్యాడు. ఇక దాంతో మరోసారి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గరికే వెళ్లి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి మూడు స్టోరీలను చెప్పాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటిని రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో పూరి జగన్నాథ్ మనమే ఒక హీరోని తయారు చేద్దామని అనుకున్నాడు. అప్పటికే కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవితేజ తో పూరి జగన్నాథ్ ఎప్పుడు కలిసిన నేను నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాను రవి అని చెప్తూ ఉండేవాడట…
ఇక తను చెప్పినట్టుగానే రవితేజని పిలిచి మనం ఒక సినిమా చేస్తున్నామని చెప్పాడట..దానికి రవితేజ మాత్రం పూరి జగన్నా జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ నిజంగానే రవితేజని పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి లాంటి వరుస సినిమాలను చేసి బ్లాక్ బాస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే స్టార్ హీరోలు మనకు డేట్స్ ఇవ్వడం లేదు కాబట్టి మనమే ఒక హీరోని తయారు చేద్దామనే ఒకే ఒక కాన్సెప్ట్ తో పూరి రవితేజ ను హీరోగా చేశాడు. దాంతో రవితేజ కి ఒక మంచి లైఫ్ దొరికిందనే చెప్పాలి… అలా ఒక దర్శకుడు తలుచుకుంటే హీరోని తయారు చేయగలడు అని చెప్పడానికి పూరీ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు…