Ileana: ఫేడ్ అవుట్ హీరోయిన్ ఇలియానా సడెన్ గా వైజాగ్ లో మొన్న ఓ షో రూమ్ ను ఓపెన్ చేయడానికి వచ్చింది. అమ్మాయిలా ఉండాల్సిన ఇలియానా మొత్తానికి ఆంటీలా మారిపోయింది. దట్టమైన మేకప్ వేసుకున్నప్పటికీ.. మొహంలోని ఆ ముదురు తనం కొట్టొచ్చినట్టు సృష్టంగా కనిపిచింది. మరి అలాంటి ఇలియానా తెలుగు సినిమాల్లో మళ్ళీ హీరోయిన్ గా నటిస్తోందట. షో రూమ్ ఓపెన్ చేశాక, ఇలియానా నేరుగా హైదరాబాద్ లోని రవితేజ అఫీస్ కి వచ్చింది.

తనకు ఎలాగైనా హీరోయిన్ గా ఒక ఛాన్స్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేసింది. రవితేజ – ఇలియానా మధ్య మంచి అనుబంధం ఉంది లేండి. గతంలో ఈ ముదురు జంట పై అనేక లేత పుకార్లు తెగ వైరల్ అయ్యాయి. సరే నిప్పు లేనిది పొగ రాదు అంటారు కాబట్టి.. అన్నట్టు నిప్పు గురించి ఇక్కడ అప్రస్తుతం. అయితే, ఎంత దగ్గర బంధం లేకపోతే, ఎప్పుడో తెగిపోయిన బంధాన్ని వెతుక్కుంటూ ఇలియానా ఎందుకు వస్తోంది.
నిజానికి ఇలియానా వ్యవహార శైలి మొదటి నుంచి సరిగ్గా లేదు. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తాం అంటే.. ఆమె తెలుగు సినిమాలను చిన్న చూపు చూసింది. ఏ తెలుగు సినిమా డైరెక్టర్ ముంబై వెళ్లి మరీ కథ చెప్పినా.. చివరకు నో అంటూ సరిగ్గా సమాధానం కూడా చెప్పేది కాదు. కాకపోతే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.
Also Read: జీవితంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇదే !
కాలం గడిచే కొద్దీ ఇలియానా కూడా చాలా మారింది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక, ఆమె ఆలోచనా విధానం మారిందట. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది ఈ గోవా సుందరి. ఆకలి ఎక్కువ అయి బలహీన పడితే.. పులి కూడా గడ్డి తినడానికి ఉత్సాహ పడుతుంది. ప్రస్తుతం ఇలియానా పరిస్థితి ఇదే.
మరి రవితేజ ఇలియానా కి ఛాన్స్ ఇపిస్తాడో లేదో చూడాలి. రవితేజ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. మొదట ఆ పాత్రలో తమన్నాను తీసుకోవాలనుకున్నారు. మరి ఇప్పుడు రవితేజ సాయంతో ఆ పాత్రలోకి ఇలియానా వస్తుందేమో చూడాలి.
Also Read: Balayya: బాలయ్యకి ఎకౌంట్స్ లేకపోయినా సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు !