https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ సినిమాలో ఈ హీరో విలన్ గా చేస్తే రికార్డ్స్ బ్రేక్ అవ్వాల్సిందే…

పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్న తెలుగు హీరో అయిన ప్రభాస్ భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తొందర్లోనే పాన్ వరల్డ్ లో ఒక సినిమాని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 03:39 PM IST

    If this hero plays the villain in Prabhas movie, the records will be broken...

    Follow us on

    Prabhas: ప్రస్తుతం ఇండియా లో సినిమా అంతా ఒకటే అయింపోయింది. ఇంతకుముందు సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలు అంటూ చాలా రకాలైన సినిమాలు ఉండేవి. ఇప్పుడు సినిమా మొత్తం ఒకటే అయిపోయింది అదే ‘ఇండియన్ సినిమా’…ఇక ఇప్పుడు ఏ భాషలో సినిమా వచ్చిన సరే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమాను చూసి ఆదరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్న తెలుగు హీరో అయిన ప్రభాస్ భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తొందర్లోనే పాన్ వరల్డ్ లో ఒక సినిమాని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ప్రభాస్ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘చియాన్ విక్రమ్'(Chiyan Vikram) విలన్ గా చేస్తే చూడాలని చాలామంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి వైవిద్యమైన పాత్రలను పోషించడంలో విక్రమ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఆయన చేత ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రని చేయిస్తే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఆయన విలన్ గా చేసే సినిమాలో ప్రభాస్ హీరోగా ఉంటే మాత్రం అది ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అంటూ మరి కొంతమంది అభిప్రాయాపడుతున్నారు. ఇక మొత్తానికైతే చియాన్ విక్రమ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని పాన్ ఇండియా రేంజ్ లో చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

    కాబట్టి తొందర్లోనే వీళ్ళ కాంబో లో ఒక అదిరిపోయే హిట్ సినిమా వస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరూ మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. కాబట్టి ప్రభాస్ విక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుంది. అందులో విక్రమ్ ను విలన్ గా పెడితేనే సినిమా బాగా సెట్ అవుతుంది అంటూ కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు…