https://oktelugu.com/

Tollywood: ఈ స్టార్ హీరోలు విలన్లు గా మారితే తెలుగు సినిమాలకి పర భాష నటులతో అవసరం ఉండదా..?

నిజానికి లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా మారి ఒక భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 23, 2024 / 03:11 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మీడియం రేంజ్ హీరోలు వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అయితే రావడం లేదు. అయినప్పటికీ హీరో గానే కంటిన్యూ అవుతూ సినిమాలను చేస్తున్నారు. తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని, విలన్లుగా గాని మారే ఒక మంచి అవకాశం ఉన్నా కూడా దాన్ని వాడుకోవడం లేదు.

    నిజానికి లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా మారి ఒక భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ఇక అలానే హీరోగా చేయడం మానేసి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెడితే కొంత మంది స్టార్ హీరోలకు మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది గోపీచంద్…

    జయం సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత ‘యజ్ఞం ‘ సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ అడపాదడప సక్సెస్ లు వస్తున్నాయి తప్ప ఆయనకు సాలిడ్ సక్సెస్ అయితే రావడం లేదు. ఇక దాంతో ఆయన ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా ఆడుతుందా పోతుందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో గోపీచంద్ విలన్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే ఆయనకి భారీ క్రేజ్ దక్కుతుంది కదా అని చాలా మంది సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఇక తెలుగులో సరైన విలన్లు లేక మనవాళ్లు బయటి నుంచి యాక్టర్స్ ను తీసుకోవాల్సి వస్తుంది. ఇక వీళ్ళు ఇక్కడ విలన్ గా మారితే వేరే బయటి వారిని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు… ఇక గోపీచంద్ తో పాటు అల్లరి నరేష్ కూడా విలన్ గా మారి నటిస్తే చాలా వైవిధ్యమైనటువంటి నటనను కనబరిచే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. విలన్ గా నటించి ఈజీగా ప్రేక్షకులను మెప్పించగలిగే సత్తా కూడా ఆయన దగ్గర ఉంది. మరి ఆయన కూడా విలన్ గా మారితే బాగుంటుందనే అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి వీళ్లలో ఎవరు ఏ టైం వరకు హీరోగా కొనసాగి ఆ తర్వాత విలన్లు గా మారతారు అనేది…