NTR Son Ramakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన నటుడు నందమూరి తారక రామారావు…. ఈయన చేసిన సినిమాల వల్లే తెలుగు సినిమా స్థాయి అనేది అప్పట్లోనే ఇండియా వైడ్ గా విస్తరించింది. ముఖ్యంగా ఈయన పోషించిన పౌరాణిక పాత్రలను హిందీ సినిమా హీరోలు కూడా పోషించలేకపోయారు. పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరుగా మారిన ఎన్టీయార్(NTR) ని, ఆయన సినిమాలను చూడడానికి హిందీ జనాలు సైతం ఎగబడే వారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
అలాంటి గొప్ప నటుడు నటవారసత్వాన్ని కొనసాగించడానికి మొదటగా ఆయన పెద్ద కొడుకు అయిన రామకృష్ణని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయనకి నటనలో శిక్షణను ఇప్పించడమే కాకుండా ఒక స్టార్ హీరో అవ్వడానికి ఎలాంటి లక్షణాలు అయితే ఉండాలో వాటన్నింటిని ఆయన అలవర్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ గారి తమ్ముడు అయిన త్రివిక్రమ రావు అలాగే ఎన్టీఆర్ కొడుకు అయిన రామకృష్ణ(Ramakrishna) చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక రామకృష్ణ ఎంట్రీ కి సంబంధించిన అన్ని పనులు త్రివిక్రమరావే చూసుకునేవాడు.
ఇలాంటి క్రమంలో ఒక పని మీద మద్రాస్ నుంచి రామకృష్ణ వాళ్ళ సొంత ఊరు అయిన నిమ్మకూరు కి వెళ్ళాడట. అక్కడ ఆయనకి మసూచి వ్యాధి సోకడంతో అప్పుడు దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ లేకపోవడంతో ఆయన మరణించారు. దాంతో ఎన్టీఆర్ చాలా రోజులపాటు బాధకు గురయ్యాడనే విషయాన్ని అతని సన్నిహితులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. 17 సంవత్సరాల కొడుకు హీరో అవుతాడు అనుకుంటే అలా చనిపోవడం అనేది ఆయన ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి. ఇక తన ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి తననే వారసున్ని చేద్దామని అనుకున్న ఎన్టీఆర్ ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా రోజులపాటు మనోవేదనని అనుభవించాడట…
ఇక ఇప్పుడు రామకృష్ణ కనక ఉండి ఉంటే ఆయన టాప్ హీరోగా ఉంటూ నందమూరి ఫ్యామిలీ కి సంబంధించిన అన్ని విషయాలను తనే చూసుకునేవాడు అంటూ నందమూరి ఫ్యామిలీతో సన్నిహితం గా ఉన్న చాలామంది సీనియర్ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక రామకృష్ణ కి ఎన్టీయార్ గారిలాగే నటన మీద మంచి ఆసక్తి ఉండేదట. ఆయన ఇండస్ట్రీ కి వస్తే మాత్రం తప్పకుండా స్టార్ హీరో అయ్యేవాడని చాలా మంది చెప్తూ ఉంటారు…