https://oktelugu.com/

Janhvi Kapoor: దేవర సెట్స్ లో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కి అలాంటి అనుభవం… కీలక కామెంట్స్ చేసిన శ్రీదేవి కూతురు!

జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా దేవర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్టీఆర్ వేగాన్ని అందుకోలేకపోతుందట. ఎన్టీఆర్ ఆమెకు చుక్కలు చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మేరకు ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : July 26, 2024 / 12:11 PM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor: సిల్వర్ స్క్రీన్ ని దశాబ్దాల పాటు ఏలింది శ్రీదేవి. సౌత్ నుండి ఆమె ప్రస్థానం నార్త్ కి పాకింది. హిందీలో కూడా శ్రీదేవి తిరుగులేని హీరోయిన్ గా సత్తా చాటింది. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ మూవీ దఢక్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 2018లో దఢక్ విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్ హోటల్ లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది.

    శ్రీదేవి- సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో భారీ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కాయి. వీరిద్దరూ సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ దేవర మూవీలో నటిస్తున్నారు. దేవర చిత్రానికి ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. దేవర చిత్రంతో జాన్వీ కపూర్ సౌత్ లో అడుగుపెడుతుంది. జాన్వీ జత కడుతున్న మొదటి స్టార్ హీరో కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెప్పారు.

    దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ ఉలజ్ విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 2న థియేటర్స్ లోకి రానుంది. ఉలజ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ దేవర మూవీ విశేషాలు పంచుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

    తెలుగువారి పని తీరును నేను ఇష్టపడతాను. వారు సినిమాను, కళలను గౌరవిస్తారు. హుందాగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. ఆయన రాగానే సెట్ లో సందడి నెలకొంటుంది. అందరూ ఉత్సాహంగా మారిపోతారు. ఇటీవల షెడ్యూల్ లో మా ఇద్దరి మీద ఒక సాంగ్ షూట్ చేశారు. ఎన్టీఆర్ డ్యాన్స్ వేగాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన సెకనులో చేసేది నాకు 10 రోజుల సమయం పడుతుంది. అందుకే నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నాను.. అని జాన్వీ చెప్పుకొచ్చింది.

    జాన్వీ మాటలు విన్నాక… ఎన్టీఆర్ వేగాన్ని ఆమె అందుకోలేకపోతుంది. శ్రీదేవి కూతురికి ఎన్టీఆర్ చుక్కలు చూపిస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే దర్శకుడు కొరటాల శివ మీద కూడా జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు. విషయం ఏదైనా సున్నితంగా చెబుతారు. కొరటాల శివతో పని చేయడం చాలా సులభం.. అని జాన్వీ కపూర్ అన్నారు.

    దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. దేవర విడుదల కాకుండానే జాన్వీ కపూర్ మరో భారీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కనున్న ఆర్సీ 16కి జాన్వీ కపూర్ సైన్ చేసింది. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో ఆర్సీ 16 తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లనుంది.