https://oktelugu.com/

Renu Desai: నన్ను పని మనిషి పెంచింది, విడాకుల కంటే అదే ఎక్కువ బాధించింది… రేణు దేశాయ్ జీవితంలో ఇంత చీకటి ఉందా?

నేను తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. నేను పడ్డ వేదన నా పిల్లలు పడకూడదు. వారి జీవితం నాశనం కాకూడదు. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను... అంటూ సంచలన కామెంట్స్ చేసింది రేణు దేశాయ్. విడాకులతో పాటు రెండో వివాహం గురించి రేణు దేశాయ్ షాకింగ్ విషయాలు బయట పెట్టింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 31, 2024 / 11:39 AM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.తన జీవితంలో దాటుకుని వచ్చిన చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తో విడాకుల కంటే ఓ విషయం అత్యంత బాధించింది అని అన్నారు. తనలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదని రేణు దేశాయ్ అన్నారు. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది కూడా అందుకే అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

    Also Read: తన ఆటిట్యూడ్ వల్లనే ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆర్జీవీ..?

    రేణు దేశాయ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జంటగా నటించింది. ఆ తర్వాత జానీ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. అనంతరం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆధ్య జన్మించారు. అయితే కొంతకాలానికి వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

    విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నాడు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాగోగులు చూసుకుంటూ సింగల్ గానే ఉంటున్నారు. సినిమాలు చేయనప్పటికీ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అకీరా, ఆధ్య లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఆమె అభిమానులతో పంచుకుంటారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె షేర్ చేసే పోస్టులకు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.

    వారికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. ఆమె నిత్యం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇది పక్కన పెడితే .. తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ .. నా తల్లిదండ్రులు ముందుగా మగ పిల్లాడు జన్మిస్తాడు అని నమ్మకంతో ఉన్నారు. కానీ నేను పుట్టడంతో వాళ్ళు నిరాశకుగురయ్యారు.

    నా తండ్రి కనీసం నన్ను చూడటానికి, తాకడానికి కూడా ఇష్ట పడలేదు. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారు. కానీ నా పేరెంట్స్ చదుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు, అని రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను పొందలేకపోవడం పెద్ద నరకం. మా ఇంట్లో పనిమనిషి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. పవన్ కళ్యాణ్ తో విడాకుల కంటే కూడా పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం నిజంగా నన్ను చాలా భాద పెట్టే అంశం.

    ఆ భాధ ఎప్పటికీ మర్చిపోలేను జీవితాంతం ఉంటుంది. నా లాంటి జీవితం పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఓ కీలక పాత్ర చేసింది. దర్శకత్వం వహించాలి అనేది కూడా తన కోరిక అని రేణు దేశాయ్ గతంలో చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్ కూడాను.

     

    Also Read: రజినీకాంత్ కోసం రంగం లోకి దిగుతున్న ధనుష్…ఇంతకీ వీళ్ళ మధ్య మాటలు ఉన్నాయా..?