Indra Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని, ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవ కార్యక్రమాలు గాని మనకు చిరంజీవి గారిని చాలా ఉన్నత స్థాయి లో పరిచయం చేశాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.ఇక ఈయన డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన ఇంద్ర సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. ఇక ఈ సినిమా విషయంలో అప్పట్లో చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి అవి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అయితే బి గోపాల్ 1999లో సమరసింహారెడ్డి అనే సినిమా తీశాడు.ఈ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటిని బ్రేక్ చేసింది.ఈ సినిమాకి రాజమౌళి వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ని అందించారు… ఇక అప్పట్నుంచి వరుసగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం జరిగింది. ఇక ఇదే క్రమంలో 2001 వ సంవత్సరంలో బి గోపాల్ బాలయ్య బాబు కాంబినేషన్ లోనే నరసింహనాయుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే రావడం ఇది కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టడంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇంకోసారి వీళ్ళ కాంబినేషన్ లోనే మరో ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయి ఆ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అయితే అనుకోని సందర్భాల్లో బాలయ్య కొంచెం బిజీ ఉండడం వల్ల ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దగ్గరికి ఈ కథ వెళ్ళడం ఆయన బి.గోపాల్ తో ఈ సినిమాని మనం చిరంజీవి గారితో చేద్దామని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఒప్పించి ఇంద్ర సినిమా చేయడం జరిగింది.
ఇక ఈ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు నరసింహనాయుడు క్రియేట్ చేసిన ఇండస్ట్రీ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక ఫస్ట్ టైం చిరంజీవి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో చిరంజీవి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఈ సినిమాకు నీరాజనాలు పట్టారు… అలా బాలయ్య బాబు చేయాల్సిన సినిమా చిరంజీవి దాకా వెళ్ళి ఇండస్ట్రీ హిట్ కొట్టింది…