Hari Priya: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకి వచ్చిన సక్సెస్ లని సరిగ్గా వాడుకోలేక తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. ఇక అలాంటి వాళ్లు ఆ తర్వాత తమ లైఫ్ లో పెళ్లిళ్లు చేసుకొని సెటిలైపోయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే నాచురల్ స్టార్ నాని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు జి అశోక్ దర్శకత్వంలో చేసిన పిల్ల జమిందారు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నాని అప్పట్లో వరుస సినిమాలను లైన్ లో పెట్టి చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే నానికి జోడిగా ఈ సినిమాలో బిందు మాధవి, హరిప్రియ అనే ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఇక బిందు మాధవి విషయం పక్కన పెడితే హరి ప్రియ మాత్రం ఈ సినిమా సక్సెస్ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆమె చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది.

ఇంకా ఆమె తన ఎంటైర్ కెరియర్ లో తకిట తకిట, పిల్ల జమిందారు, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాటా, ఈ వర్షం సాక్షిగా, జై సింహ అనే సినిమాలతో తను నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఆమె జైసింహ సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేసింది. ఇక ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే ఆమెకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఆమె పిల్ల జమిందారు సినిమాలో నటించినప్పటి ఫోటోని తను ఇప్పుడు ఉన్న ఫోటోని ఆడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెని విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు చాలా క్యూట్ గా అందంగా ఉండే హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుతం కొంచెం లావుగా మారింది అంటూ ఆమె పైన కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు..