Thank You Movie Review: వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” చిత్రం ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉంది ?, చైతు మెప్పించాడా? లేదా ? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ
జీవితంలో ఓ మనిషి సక్సెస్ అయ్యాడంటే.. దానికి కారణం అతను మాత్రమే కాదు, అతని జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ అని చెప్పే కోణంలో సాగింది ఈ కథ. ఈ జర్నీలో ఓ మధ్యతరగతి అబ్బాయి (నాగచైతన్య) ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. అనంతరం అతని జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. తన విజయానికి కారణం ఎందరో అని అర్ధం చేసుకుంటాడు.
Also Read: Koratala Siva: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల శివ.. కారణం అదే
దాంతో, తన విజయ పథంలో తనకు సహకరించిన వారందరికీ థాంక్స్ చెప్పడానికి చైతు బయలుదేరతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ?, చివరకు అతనికి జీవితం గురించి అర్ధం అయ్యింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సక్సెస్ కి, థాంక్యూకి సంబంధించిన మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్, తన అద్భుతమైన టేకింగ్ తో, వెరీ ఎమోషనల్ విజన్ తో ఈ సినిమాని ఎమోషనల్ లవ్ డ్రామాగా చాలా బాగా మలిచాడు. హీరో నాగచైతన్య క్యారక్టరైజేషన్ దగ్గర నుంచి హావభావాల వరకు, అలాగే హీరోయిన్ రాశి ఖన్నా లుక్ అండ్ క్యారెక్టర్ లోని షేడ్స్ వరకు దర్శకుడు విక్రమ్ కె కుమార్ తీసుకున్న జాగ్రత్తలు సినిమా స్థాయిని నాలుగింతలు పెంచింది.
మొత్తమ్మీద చైతు కూడా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి ఎమోషన్స్ ను జనరేట్ చేశాడు. టీనేజ్ అబ్బాయిగా, కాలేజ్ స్టూడెంట్ గా, సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా.. ఇలా 3 డిఫరెంట్ షేడ్స్ లో నాగచైతన్య తన పాత్రకు జీవం పోశాడు. అలాగే ప్రతి దశలో వచ్చే గర్ల్ ఫ్రెండ్ తో అతని లవ్ ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి.
ఏ సినిమాలోనైనా కథను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. కథను ఎలివేట్ చేయడానికి మాత్రమే ఆ సీన్స్ ఉపయోగపడతాయి. ఆ సీన్స్ ను కూడా విక్రమ్ కె కుమార్ చాలా ఎంటర్ టైన్ గా చెప్పాడు. కాకపోతే, సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం వంటి అంశాలు థాంక్యూ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమా అయితే బాగుంది.
తీర్పు :
‘థాంక్యూ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ సైకలాజికల్ డ్రామాలో స్వచ్ఛమైన బంధాల గురించి చాలా బాగా చెప్పారు. చూపించారు. కాకపోతే ఇంతకుమించి ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏమీ లేవు. మొత్తమ్మీద ఈ సినిమా చూడొచ్చు.