Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Geetha Krishna: ఇక శ్యామలకు అవకాశాలు రావు, కాళ్లపై పడాల్సిందే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Geetha Krishna: ఇక శ్యామలకు అవకాశాలు రావు, కాళ్లపై పడాల్సిందే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Geetha Krishna: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున యాంకర్ శ్యామల ప్రచారం చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వంగా గీతకు మద్దతుగా క్యాంపైన్ చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ తోడేలు, గుంట నక్క అంటూ ఒక కథ చెప్పింది. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

తాజా ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారిని టీడీపీ క్యాడర్ టార్గెట్ చేస్తుంది. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు దర్శకుడు గీతాకృష్ణ. శ్యామల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఫైర్ అయ్యాడు.

ఆయన మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై శ్యామల చెప్పిన కథ గురించి నాకు తెలిసింది. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత శ్యామల ఎక్కడ .. ఇప్పుడు చెప్పమను జగన్ కి కథలు. ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బులు ఇచ్చి ఉంటారు. లేదంటే మరేదో స్వలాభం కోసం ప్రచారం చేసి ఉంటుంది. వంగా గీతా పిఠాపురంలో ఓడిపోతుందని నేను ఎప్పుడో చెప్పాను. శ్యామల ఎవరో కూడా జనానికి తెలియదు.

ఇప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు వెళితే మొఖాన ఉమ్మేస్తారు. జగనన్న అంటూ భజన చేసింది. ఇప్పుడు జగన్ కే అడ్రస్ లేదు. రాజకీయాల గురించి ఆమెకి ఏం తెలుసు. మొగుడిపై ఏవో కేసులు ఉన్నాయని ప్రచారానికి వెళ్ళుంటుంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా రావు. కాళ్ళపై పడాల్సిందే లేదంటే కష్టం. నువ్వేమైనా పెద్ద పొలిటిషియన్ వా, హీరోయిన్ వా .. ఏ బొంగు కాదు .. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటూ శ్యామల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

Most Popular