Harish Shankar Vs Anil Ravipudi: హరీష్ శంకర్ vs అనిల్ రావిపూడి ఈ ఇద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్…

నిల్ రావిపూడి గురించి కనక చూసుకున్నట్లైతే ఆయన చేసిన మొదటి సినిమా పటాస్ తోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆయన కెరియర్ లో చేసిన ఏడు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా డబుల్ హ్యాట్రిక్ ని కూడా నమోదు చేసుకున్నాడు.

Written By: Gopi, Updated On : August 4, 2024 3:26 pm

Harish Shankar Vs Anil Ravipudi

Follow us on

Harish Shankar Vs Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపు ఉంది. ఇక తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే కమర్షియల్ సినిమాలే బెస్ట్ ఆప్షన్… ఎందుకంటే మన స్టార్ హీరోలు ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తే వాళ్ల అభిమానులు ఆ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపించరు. ఎందుకంటే స్టార్ హీరోలను ఒక సూపర్ హీరోల చూడటమే మన ప్రేక్షకులకు అలవాటైపోయింది. కాబట్టి వారు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తే కథ కి ప్రాధాన్యం ఇచ్చి అన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. ఇక దాన్ని ఆయా హీరోల అభిమానులు జీర్ణించుకోలేర. కాబట్టి కమర్షియల్ సినిమా అయితే హీరో పాయింట్ అఫ్ వ్యూ లోనే కథ నడుస్తుంది. అందులో హీరో ఒక్కడే హైలెట్ అవుతూ ఉంటాడు. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులకు అమితంగా నచ్చడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లను కూడా నమోదు చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల కమర్షియల్ సినిమాకి తెలుగులో మంచి గిరాకీ అయితే పెరిగింది. ఇక ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లకు మంచి డిమాండ్ అయితే ఉంది. వీళ్లిద్దరూ రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి వీరిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే విషయం మీద పలు రకాల ఆసక్తికరమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఇక వీళ్ళలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా హరీష్ శంకర్ గురించి కనక చూసుకున్నట్లైతే రవితేజతో చేసిన షాక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కొద్ది రోజులపాటు గ్యాప్ తీసుకొని మళ్ళీ రవితేజ తోనే మిరపకాయ్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఒక సక్సెస్ ఫుల్ సినిమాను చేసి ఇండస్ట్రీలో తనను మించిన కమర్షియల్ డైరెక్టర్ మరొకరు లేరు అంటూ మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అంత పెద్ద సక్సెస్ లను సాధించినప్పటికీ కమర్షియల్ వేలో మాత్రం ప్రతి ప్రేక్షకుడిని ఈయన సినిమాలు ఎంగేజ్ చేస్తూ ఉంటాయి… అందుకే ఈయన ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

ఇక అనిల్ రావిపూడి గురించి కనక చూసుకున్నట్లైతే ఆయన చేసిన మొదటి సినిమా పటాస్ తోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆయన కెరియర్ లో చేసిన ఏడు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా డబుల్ హ్యాట్రిక్ ని కూడా నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో మరొక సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు…

ఇక వీళ్లిద్దరిలో సక్సెస్ ల పరంగా చూసుకుంటే అనిల్ రావిపూడి హరీష్ శంకర్ కంటే కాస్త ముందంజలో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే దానికి కారణం… ఇక హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో అలాగే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఓజి ‘ సినిమాలతో సక్సెస్ లను కొడితే ఆయన కూడా అనిల్ రావిపూడి ని డామినేట్ చేసి ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…